Fitness Tips: 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఏంటి? ఇలా చేస్తే మీ జీవితంలో కీలక మలుపు

6-6-6 రూల్.. ఉ.6 గంటలకు, సా.6 గంటలకు 60 నిమిషాలు వాక్ చేయాలి. ఇలా వాక్ కు ముందు 6 నిమిషాల వార్మ్‌-అప్‌ చేయాలి. ఇలా చేస్తే శరీర జీవక్రియలను మెరుగుపరచి బరువు తగ్గడంలో సాయపడుతుంది. మార్నింగ్ వాక్ శక్తిని, ఈవినింగ్ వాక్ జీర్ణశక్తిని పెంచుతుంది.

Fitness Tips: 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఏంటి? ఇలా చేస్తే మీ జీవితంలో కీలక మలుపు
Whatsapp Image 2025 01 11 At 11.05.40
Follow us
Prashanthi V

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 11, 2025 | 3:39 PM

ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సరైన వ్యాయామం చేయడం, ఫుడ్ డైట్ ఫాలో అవ్వడం లాంటి వాటితో పాటు వాకింగ్ కూడా చేసుకుంటున్నారు. ఇందులో ‘6-6-6’ రూల్ అనేది నిపుణులు సూచిస్తున్న ఒక సులభమైన విధానం. ఈ రూల్ ని ఫాలో అవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇంతకీ ఈ 6-6-6 రూల్ ఏంటి.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

6-6-6 వాకింగ్ రూల్‌

6-6-6 వాకింగ్ రూల్ అనేది ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు నడవడం, నడకకు ముందు 6 నిమిషాలు వార్మ్‌-అప్‌ చేయడమే. ఈ విధానాన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల 60 నిమిషాల వాకింగ్ తో శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. మార్నింగ్ వాకింగ్ శరీర జీవక్రియలను సమన్వయం చేస్తుంది. అదనపు కేలరీలను కరిగించి శక్తిని పెంచుతుంది. ఈవినింగ్ వాకింగ్ శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. ఈ పద్ధతి వల్ల ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా, ఆరోగ్య సమస్యలను నియంత్రించడం కూడా సాధ్యమవుతుంది.

మార్నింగ్ వాకింగ్ బెనిఫిట్స్

మార్నింగ్ వాకింగ్ జీవక్రియలను నియంత్రించి శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇదివరకు జరిపిన అనేక పరిశోధనల ప్రకారం, మార్నింగ్ వాకింగ్ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. అదనంగా శరీరంలోని కేలరీలను కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి, చురుకైన శక్తిని పొందడానికి సహాయపడుతుంది.

ఈవినింగ్ వాకింగ్

ఈవినింగ్ వాకింగ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. దీని వల్ల రాత్రిపూట మంచి నిద్ర రావడం సాధ్యమవుతుంది. ఇది రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలను నియంత్రిస్తుంది. అలాగే గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. సాయంకాలపు నడకను రోజువారీ అలవాటుగా మార్చుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

60 నిమిషాల వాకింగ్ తో ఎన్నో ప్రయోజనాలు నిపుణుల ప్రకారం, రోజూ 60 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. వాకింగ్ కు ముందు ఆరు నిమిషాల వార్మ్‌-అప్‌ చేయడం ద్వారా హార్ట్‌రేట్ పెరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి శరీరాన్ని నడకకు సిద్ధం చేస్తాయి. అంతేకాకుండా, నడక తర్వాత తీసుకునే విశ్రాంతి వల్ల కండరాల అలసట తగ్గి, శరీరంలోని మలినాలు తొలగించబడతాయి.

ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే ప్రారంభించండి. 6-6-6 రూల్ అనేది సరళమైన పద్ధతి. దీనిని రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం, అందం కూడా మెరుగవుతాయి. మీరు దైర్యంగా ఈ నియమాన్ని పాటించడం ప్రారంభిస్తే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

సీనియర్లను బయటకు వచ్చేలా చేసింది ఎవరు..?
సీనియర్లను బయటకు వచ్చేలా చేసింది ఎవరు..?
కొత్త రంగు, అదిరే ఫీచర్లతో టాటా నెక్సాన్..మూడు వేరియంట్లలో విడుదల
కొత్త రంగు, అదిరే ఫీచర్లతో టాటా నెక్సాన్..మూడు వేరియంట్లలో విడుదల
నిర్మాణంలో ఉన్న ట్యాంకర్ కూలి కార్మికులు సమాధి..18 మంది వెలికితీత
నిర్మాణంలో ఉన్న ట్యాంకర్ కూలి కార్మికులు సమాధి..18 మంది వెలికితీత
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం! ఈ జాగ్రత్తలు తీసుకోండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం! ఈ జాగ్రత్తలు తీసుకోండి
పల్సర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. న్యూ రేంజ్‌తో ఆర్ఎస్ 200 అప్‌డేట్
పల్సర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. న్యూ రేంజ్‌తో ఆర్ఎస్ 200 అప్‌డేట్
ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే సెల్ ఫోన్ ఫ్రీ..!
ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే సెల్ ఫోన్ ఫ్రీ..!
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరిని ప్రేమించి..
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరిని ప్రేమించి..
చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా?
చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా?
దురద వస్తుందా..? వామ్మో.. ఈ వ్యాధుల లక్షణం కావచ్చు.. జాగ్రత్త
దురద వస్తుందా..? వామ్మో.. ఈ వ్యాధుల లక్షణం కావచ్చు.. జాగ్రత్త
పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం