అమెరికాలో కరోనా..ఆరుగురి మృతి.. పెరుగుతున్న రిస్క్.. హై అలర్ట్

అమెరికాలో కరోనాకు గురై మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. మృతులంతా వాషింగ్టన్ వాసులే.. దీంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పసిఫిక్ నార్త్ వెస్ట్ నుంచి ఈ కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు.

అమెరికాలో కరోనా..ఆరుగురి మృతి.. పెరుగుతున్న రిస్క్.. హై అలర్ట్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 03, 2020 | 12:23 PM

అమెరికాలో కరోనాకు గురై మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. మృతులంతా వాషింగ్టన్ వాసులే.. దీంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పసిఫిక్ నార్త్ వెస్ట్ నుంచి ఈ కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. కరోనా వ్యాధికి చికిత్స వేసవి నాటికి అందుబాటులో ఉంటుందని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు.  ముఖ్యంగా ఇటలీ, దక్షిణ కొరియా నుంచి విమానాల్లో వస్తున్న ప్రయాణికులను స్క్రీనింగ్ చేసే ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు. ‘గిలీడ్’ అనే ఫార్మాసిటికల్ సంస్థ డెవలప్ చేసిన యాంటీ వైరల్ డ్రగ్

‘రెమిడిసివిర్’  గురించి ప్రస్తావించిన ఆయన.. దీన్ని ఇప్పటికే రోగులకు వాడుతున్నట్టు తెలిపారు. ఇటలీలో 1700, సౌత్ కొరియాలో నాలుగువేల కరోనా కేసులు నమోదైనట్టు తెలిసిందన్నారు. కాగా-ఇటీవలే ఇరాన్ నుంచి అమెరికాకు  వఛ్చిన ఓ మహిళ.. కరోనా వ్యాధితో మరణించింది. వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ, సీటెల్, స్నోమిష్ కౌంటీలకు చెందిన వ్యక్తులు ఈ వైరస్ లక్షణాలు సోకి మృతి చెందారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని కింగ్ కౌంటీలోని అధికారి జెఫ్ డచిన్ తెలిపారు. ఒకే సమయంలో చాలామందికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతోందని ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఓ హోటల్ లో ఐసొలేషన్ వార్డుల్లో ఉంచాలని కూడా అధికారులు యోచిస్తున్నారు.