మరీ ఇంత ఘోరమా.. తల్లిని చంపి.. గర్భసంచి నుంచి బిడ్డను తీసి..

పెంచుకునేందుకు తమకు ఓ బేబి కావాలనుకున్న ఓ తల్లీకూతురు అమానుషంగా ప్రవర్తించారు. గర్భవతిగా ఉన్న 19ఏళ్ల టీనేజర్‌ను హతమార్చి, ఆమె గర్భసంచి నుంచి బిడ్డను దొంగలించారు. ఆ తరువాత టీనేజర్‌ను కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన అమెరికాలోని షికాగోలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గర్భవతి అయిన మార్లేన్ ఓచోయో లోపెన్ (19) ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవు. దీంతో తనకు పుట్టబోయే బిడ్డకు ఏదైనా సాయం చేయాలంటూ ఆమె ఆ మధ్యన సోషల్ మీడియాలో పోస్ట్ […]

మరీ ఇంత ఘోరమా.. తల్లిని చంపి.. గర్భసంచి నుంచి బిడ్డను తీసి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 17, 2019 | 6:04 PM

పెంచుకునేందుకు తమకు ఓ బేబి కావాలనుకున్న ఓ తల్లీకూతురు అమానుషంగా ప్రవర్తించారు. గర్భవతిగా ఉన్న 19ఏళ్ల టీనేజర్‌ను హతమార్చి, ఆమె గర్భసంచి నుంచి బిడ్డను దొంగలించారు. ఆ తరువాత టీనేజర్‌ను కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన అమెరికాలోని షికాగోలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. గర్భవతి అయిన మార్లేన్ ఓచోయో లోపెన్ (19) ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవు. దీంతో తనకు పుట్టబోయే బిడ్డకు ఏదైనా సాయం చేయాలంటూ ఆమె ఆ మధ్యన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో పలువురు ఆమె అభ్యర్థనకు స్పందించారు. అలా స్పందించిన వారిలో క్లారిస్సా ఫిగ్యురోవా(46) కూడా ఉంది. తమ ఇంట్లో చిన్న పిల్ల బట్టలు ఉన్నాయని.. వచ్చి తీసుకెళ్లమని మార్లేన్‌కు క్లారిస్సా ఫోన్ చేసి చెప్పింది. ఈ నేసథ్యంలో మార్లేన్ ఆమె ఇంటికివెళ్లగా.. క్లారిస్సా, ఆమె కుమార్తె, కూతురు బాయ్‌ఫ్రెండ్ కలిసి గొంతునులిపి చంపేశారు. అనంతరం మార్లేన్ గర్భం నుంచి బిడ్డను బటయకు తీసి.. బాడీని కాల్చేశారు. ఆమె కారును ఆ ప్రాంతంలోని ఓ పార్కింగ్‌ ఏరియాలో భద్రపరిచారు. అయితే బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది. దీంతో 911 నంబర్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

మరోవైపు తమ కుమార్తె కనిపించకుండా పోయిందంటూ ఏప్రిల్ 23న మార్లేన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డే కేర్ సెంటర్‌లో ఉన్న తన మూడేళ్ల కుమారుడిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఆమె.. ఆ తరువాత ఇంటికి రాలేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు కూపీ లాగుతుండగా.. క్లారిస్సా మీద అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి చెక్ చేయగా మార్లేన్ ఆనవాలు లభ్యమయ్యాయి. దీంతో క్లారిస్సాను విచారించగా.. తన కొడుకు పురిట్లోనే చనిపోయాడని.. అప్పటినుంచి ఎవరైనా చిన్న బాబును పెంచుకోవాలని అనుకున్నామని.. కానీ సాధ్యపడలేదని క్లారిస్సా తెలిపింది. ఈ లోపు సోషల్ మీడియాలో మార్లేన్ తన బిడ్డకు సాయం చేయమని కోరడంతో.. ఆమె బిడ్డను దొంగతనం చేయాలని భావించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగానే బట్టలు ఇస్తామని చెప్పి మార్లేన్‌ను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు వెల్లడించింది. ఇందుకు తన కుమార్తె, ఆమె బాయ్‌ఫ్రెండ్ సహాయం చేశారని వెల్లడించింది. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

మరోవైపు మార్లేన్ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమ కుమార్తె ఎవ్వరికీ ఏ అన్యాయం చేయదని.. అలాంటిది ఇలా దారుణంగా చనిపోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని విలపించారు. అలాగే మార్లేన్ భర్త మాట్లాడుతూ.. ఇది ఆమెకు పడాల్సిన శిక్ష కాదంటూ కన్నీరుమున్నీరయ్యారు.