Monkeypox Virus: భయపెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌.. అమెరికాలో తొలి కేసు నమోదు.. అధికారుల అప్రమత్తం!

Monkeypox Virus: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే.. తర్వాత కొత్త కొత్త వైరస్‌లు వ్యాప్తి చెంది మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో పుట్టిన ..

Monkeypox Virus: భయపెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌.. అమెరికాలో తొలి కేసు నమోదు.. అధికారుల అప్రమత్తం!
Monkeypox Virus
Follow us

|

Updated on: May 19, 2022 | 1:48 PM

Monkeypox Virus: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే.. తర్వాత కొత్త కొత్త వైరస్‌లు వ్యాప్తి చెంది మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ (Coronavirus)తో ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త వైరస్‌ కలకలం రేపుతోంది. ఇటీవల బ్రిటన్‌లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు కాగా, తాజాగా అమెరికాలో తొలి కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ ఎలుకల నుంచి సోకిన జీవుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మంకీపాక్స్ వైరస్ పలు దేశాల్లో వెలుగుచూడటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కెనడాలో పదుల కొద్ది మంకీపాక్స్‌ లక్షణాలున్న వారు బయట పడ్డారు. ఇప్పుడు అమెరికా (America)లో మంకీపాక్స్‌ తొలి కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. అయితే ఇటీవల కెనడా నుంచి వచ్చిన వ్యక్తికి ఈ మంకీపాక్స్‌ వైరస్‌ నిర్ధారణ అయినట్లు అమెరికా బుధవారం ప్రకటించింది. సదరు వ్యక్తికి యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC)లో పరీక్షలు పూర్తయినట్లు యూఎస్‌ తెలిపింది. ఈ మంకీపాక్స్‌ వైరస్‌ అనేది తీవ్రమైనదిగా గుర్తించారు నిపుణులు. దీని తీవ్రత వల్ల అనారోగ్యం, సాధారణ ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే కణువుల వాపుతో మొదలై ముఖం, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీని ఇన్ఫెక్షన్‌ 2 నుంచి 4 వారాల వరకు ఉంటుందని చెబుతున్నారు.

అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల, లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఇది వ్యాధి వ్యాప్తి చెందుతుందని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ బిందువుల ద్వారా సంక్రమించవచ్చు. కలుషితమైన బట్టలు, దీర్ఘకాలం పాటు శ్వాసకోశ బిందువుల ద్వారా సంక్రమించే అవకాశం ఉందంటున్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లో 9 మంకీ పాక్స్‌ కేసులను గుర్తించగా, మే నెల ప్రారంభంలో మొదటి కేసు నైజీరియాకు వెళ్లింది.

ఈ వైరస్‌ సోకితే లక్షణాలు ఏమిటి?

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో పలు రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. మంకీపాక్స్ సోకితే తరచూ జ్వరం, కండరాలనొప్పి, ఫ్లూ లాంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడతారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. వ్యాధి బారినపడ్డ వారి ఉపయోగించిన వస్తువులను వాడినా వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనికి చికెన్ పాక్స్ లక్షణాలే ఉంటాయని తెలిపారు.

గత రెండు వారాలుగా ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్‌లో బయటపడ్డ అసాధారణంగా బయటపడ్డ డజన్లు కొద్దీ మంకీపాక్స్ కేసులకు అసహజ లైంగిక కార్యకలాపాలే కారణమని సీడీసీ పోక్స్‌వైరస్ నిపుణుడు డాక్టర్ ఇంజెర్ డామన్ అన్నారు.

చివరి సారిగా 2003లో..

కాగా, చివరి సారిగా 2003లో అమెరికాలో ఈ మంకీ పాక్స్‌ కేసులు బయట పడ్డాయి. అప్పట్లో 47 మందికి ఈ వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. మిడ్‌వెస్ట్‌ ప్రాంతంలోని పెంపుడు కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మంకీ పాక్స్ కేసు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. 100లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.