ఢిల్లీ ‘ఉగ్ర’ ఘటనలో ఇరాన్ జనరల్ ప్రమేయంః ట్రంప్

తమదేశ వైమానిక దాడుల్లో టాప్ ఇరానియన్ కమాండర్ జనరల్ ఖాసిం సోలిమని మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ‘ ఉగ్రవాద శకం ‘ అంతమైంది అని ఆయన వ్యాఖ్యానించారు. సోలిమని టెర్రరిస్టు కుట్రలు ఢిల్లీ, లండన్ కు కూడా వ్యాపించాయని పేర్కొన్నారు. (2012లో ఇండియాలోని ఇజ్రాయెలీ రాయబారి భార్య ప్రయాణిస్తున్న కారుపై జరిగిన బాంబు దాడిలో ఆమెతో బాటు అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆనాడే అమెరికా ఆరోపించింది). […]

ఢిల్లీ 'ఉగ్ర' ఘటనలో ఇరాన్ జనరల్ ప్రమేయంః ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 04, 2020 | 12:03 PM

తమదేశ వైమానిక దాడుల్లో టాప్ ఇరానియన్ కమాండర్ జనరల్ ఖాసిం సోలిమని మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ‘ ఉగ్రవాద శకం ‘ అంతమైంది అని ఆయన వ్యాఖ్యానించారు. సోలిమని టెర్రరిస్టు కుట్రలు ఢిల్లీ, లండన్ కు కూడా వ్యాపించాయని పేర్కొన్నారు. (2012లో ఇండియాలోని ఇజ్రాయెలీ రాయబారి భార్య ప్రయాణిస్తున్న కారుపై జరిగిన బాంబు దాడిలో ఆమెతో బాటు అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆనాడే అమెరికా ఆరోపించింది). ఈ సంఘటనను ట్రంప్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఈ వ్యాఖ్య చేశారు. ఇరాన్ ‘ అల్-కుడ్స్ ‘ ఫోర్స్ అధినేత, ఆ దేశ ప్రాంతీయ భద్రతా వ్యవహారాల ప్రధాన అధికారి కూడా అయిన జనరల్ సోలిమని శుక్రవారం బాగ్దాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన అమెరికన్ వైమానిక దాడిలో మరణించారు.

ఈ ఎటాక్ లో ఇరాక్ లోని శక్తిమంతమైన హషెద్ అల్-షాబీ పారామిలిటరీ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ కూడా హతమయ్యాడు. ఫ్లోరిడాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాక్ లో ఇటీవల తమ దేశ స్థావరాలపై వరుసగా జరిగిన దాడుల్లో ఓ అమెరికన్ మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, అలాగే ఆ దేశంలోని తమ దేశ ఎంబసీని కూడా ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు ముట్టడించి పెను విధ్వంసం సృష్టించారని అన్నారు. వీటి వెనుక సోలిమని హస్తం ఉందన్నారు. ‘ అతని ఉగ్రవాద కుట్రలు ఢిల్లీ, లండన్ కు కూడా వ్యాపించాయి. అనేకమంది అమాయకులను సోలిమని పొట్టన బెట్టుకున్నాడు. ఇక అతని ఉగ్రవాద శకం ముగిసినట్టే.. ‘ అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను అస్థిర పరచేందుకు సోలిమని గత ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడని, ఈ మధ్యే ఇరాన్ లో నిరసన తెలిపిన వెయ్యిమంది అమాయకుల టార్చర్, వధ కూడా సోలిమని ప్లాన్ లో భాగమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే సోలిమని మరణించినంత మాత్రాన తాము ఇరాన్ పై యుధ్ధానికి దిగబోమని ఆయన స్పష్టం చేశారు. ఆ దేశ ప్రజలపట్ల తమకెంతో గౌరవం ఉందని,  ఆ దేశ ప్రభుత్వం మారాలని తాము కోరడంలేదని ఆయన చెప్పారు. తన ఆదేశాల మేరకే ఇరాన్ ఉగ్రవాదులపై తమ దేశ సైన్యం దాడులకు దిగుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఐసిస్ చీఫ్ అల్-బాగ్దాదీని తాము మట్టుబెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇలా ఉండగా.. సోలిమని మరణంతో ఆయన స్థానే సుప్రీం కమాండర్ గా ఇస్మాయిల్ క్వానీ ని ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖొమైనీ నియమించారు. 1980-88 మధ్య ఇరాన్.. ఇరాక్ మధ్య జరిగిన యుధ్ధంలో ఇస్మాయిల్ కీలక పాత్ర పోషించారు. అటు-సోలిమని మృతికి నిరసనగా ఇరాన్ లో వేలాది మంది ప్రదర్శనలు చేశారు. అమెరికా జాతీయ పతాకాలను తగులబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.