మరో ప్రవాస భారతీయునికి పదవి నిచ్చిన బైడెన్, అమెరికాలో కోవిడ్ టెస్టింగ్ అడ్వైజర్ గా ఇండో-అమెరికన్ వినోద్ శర్మ.

అమెరికాలో హెల్త్ ఎక్స్ పర్ట్ అయిన ప్రవాస భారతీయుడు వినోద్ శర్మను కాబోయే అధ్యక్షుడు జో బైడెన్..తన కోవిడ్19 రెస్పాన్స్ టీమ్..

  • Umakanth Rao
  • Publish Date - 3:26 pm, Sat, 16 January 21
మరో ప్రవాస భారతీయునికి పదవి నిచ్చిన  బైడెన్, అమెరికాలో కోవిడ్ టెస్టింగ్ అడ్వైజర్ గా ఇండో-అమెరికన్ వినోద్ శర్మ.

అమెరికాలో హెల్త్ ఎక్స్ పర్ట్ అయిన ప్రవాస భారతీయుడు వినోద్ శర్మను కాబోయే అధ్యక్షుడు జో బైడెన్..తన కోవిడ్19 రెస్పాన్స్ టీమ్ లో టెస్టింగ్ అడ్వైజర్ గా నియమించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇక శర్మ పర్యవేక్షించనున్నారు. వైట్ హౌస్ లోని కోవిడ్ రెస్పాన్స్ టీమ్ లో ఈయనకూడా ఒకరయ్యారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో శర్మ..డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ అడ్వైజర్ గా వ్యవహరించారు. విస్కాన్సిన్ లో పుట్టి మిన్నెసోటాలో పెరిగిన వినోద్ శర్మ..ప్రవాస భారతీయుల కుమారుడు. హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, సెయింట్ లూయీస్ యూనివర్సిటీలో చదువుకున్నారు.

తాను పదవిని చేబట్టి 100 రోజులు పూర్తి అయ్యేలోగా అమెరికాలో 10 కోట్లమందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ లక్ష్యమని జో బైడెన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 23,523,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 391,955 మంది రోగులు మృత్యుబాట పట్టారు. ఇక కరోనా వైరస్ ని చాలావరకు అదుపు చేయాలన్నదే తమ ధ్యేయమని, ఇందుకు అహోరాత్రులు శ్రమిస్తామని బైడెన్ పేర్కొన్నారు. అందువల్లే వైట్ హౌస్ లో ఇంతమంది కోవిడ్ రెస్పాన్స్ టీమ్ ని నియమించినట్టు ఆయన చెప్పారు. కాగా ఈ మహమ్మారి అదుపు విషయంలో త్వరలో గద్దె దిగనున్న ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయలేదని ఆయన ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం విశేషం.