న్యూజెర్సీ లో హిందూ ఆలయ నిర్మాణంలో భారత కార్మికుల శ్రమశక్తి దోపిడీ, కోర్టు కెక్కిన వ్యవహారం, ఖండించిన సంస్థ
అమెరికా లోని న్యూజెర్సీలో నిర్మిస్తున్న హిందూ దేవాలయంలో భారత కార్మికుల శ్రమశక్తిని దోచుకుంటున్న షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఎక్కువ వేతనాలు ఇస్తామని, మన హిందూ ఆలయ
అమెరికా లోని న్యూజెర్సీలో నిర్మిస్తున్న హిందూ దేవాలయంలో భారత కార్మికుల శ్రమశక్తిని దోచుకుంటున్న షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఎక్కువ వేతనాలు ఇస్తామని, మన హిందూ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని అంటూ కూలీలు, మేస్త్రీలు వంటివారిని ప్రలోభ పెట్టి వారి చేత ఎక్కువసేపు పని చేయించుకుంటూ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిసింది. బాబా నన్ వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ అనే హిందూ సంస్థకు చెందినవారు ఇలా వీరికి తాయిలాలు చూపి వర్కర్లను రప్పించుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లేసరికి రోజుకు అతి తక్కువ డాలర్లు చెల్లిస్తున్నారని, ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటలవరకు పని చేయించుకుంటూ నెలకు కేవలం 450 డాలర్లు మాత్రం చెల్లిస్తున్నారని తెలుస్తోంది. ఈ సంస్థ మనుషుల అక్రమ రవాణాతో బాటు వేతన చట్టాలను ఉల్లంఘిస్తున్నదని వీరి తరఫున కోర్టుకెక్కిన అటార్నీ ఒకరు వెల్లడించారు. కాగా తమకు కోర్టు ఆర్డర్ ఉందని, ఆ అనుమతితో వీరి చేత పని చేయించుకుంటున్నామని ఆలయ ఏజెంటు ఒకరు చెప్పినట్టు ఎఫ్ బీ ఐ ప్రతినిధి చెప్పారు. ఈ నెల 11 న చెప్పా పెట్టకుండా కొంతమంది వర్కర్లను తొలగించినట్టు తెలిసింది. సుమారు 200 మందికి పైగా కార్మికులు శ్రమశక్తి దోపిడీకి గురవుతున్నట్టు వెల్లడైంది. వీరిలో చాలామంది దళితులని, ఇంగ్లీషు మాట్లాడలేరని కూడా తెలిసింది. ఇండియా నుంచి ఈ కార్మికులను ఆర్-1 వీసా కింద రప్పించుకుంటున్నారట. అంటే మంత్రులు లేదా మతపరమైన కార్యక్రమాలకు విదేశాలకు హాజరయ్యేవారికి ఈ వీసా ఉద్దేశించినది వీరికి ఇస్తున్న వేతనం బట్టి చూస్తే నెలకు 50 డాలర్లు అందుతోందని, మిగతా సొమ్మును ఇండియాలోని వీరి ఖాతాలకు జమ చేస్తున్నారని ఆ అటార్నీ తమ దావాలో పేర్కొన్నారు. ఈ అమాయక వర్కర్ల తరఫున డేనియల్ వెర్నర్ అనే లాయర్ కోర్టులో దావా వేశారు. ఇలా న్యూజెర్సీ లో చాలా ఏళ్ళ తరబడి సాగుతోందన్నారు.వీరిని ఎవరినీ తమ సొంత ప్రాంతాలకు వెళ్లనివ్వడంలేదని, వీరి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. పైగా వీరు ఉంటున్న చోట ఎప్పుడూ సీసీకెమెరాలతో బాటు గార్డుల నిఘా కూడా ఉంటుందన్నారు.
అయితే ఈ ఆరోపణలను ఈ సంస్థ సీఈఓ కాను పటేల్ ఖండించారు. తాము వీరిని వేధించడం లేదని, వేతన చట్టాన్ని బట్టి వీరికి వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ : “డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను” తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సాయి పల్లవి వీడియో ..: Sai Pallavi as docter video.