భారత్ అమెరికాకు మిత్ర దేశమా..?
భారత్ తమకు మిత్రదేశమంటూ ప్రశంసలు కురిపించింది అమెరికా. ఇరాన్ నుంచి చమురు ఆంక్షల విషయంలో భారత్ సహకారం గొప్పగా ఉందని ప్రకటించింది. అమెరికా విజ్ఞప్తి మేరకు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు నిలిపివేసిందని.. ఇండియాతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపింది. కాగా.. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీకి వర్తింపజేసిన ఆంక్షలనే జరీఫ్‌కు కూడా అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ అధ్యక్షుని నిర్ణయాలను ప్రపంచమంతా […]
భారత్ తమకు మిత్రదేశమంటూ ప్రశంసలు కురిపించింది అమెరికా. ఇరాన్ నుంచి చమురు ఆంక్షల విషయంలో భారత్ సహకారం గొప్పగా ఉందని ప్రకటించింది. అమెరికా విజ్ఞప్తి మేరకు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు నిలిపివేసిందని.. ఇండియాతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపింది.
కాగా.. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీకి వర్తింపజేసిన ఆంక్షలనే జరీఫ్‌కు కూడా అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ అధ్యక్షుని నిర్ణయాలను ప్రపంచమంతా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే.. అమెరికా ఆంక్షలు తమపై ఎలాంటి ప్రభావం చూపవంటోంది ఇరాన్. తమకు స్వదేశంలో తప్ప ఎక్కడా ఆస్తులు లేవని జరీఫ్ ట్వీట్ చేయగా.. అమెరికా చర్యలు పిల్ల చేష్టలను తలపిస్తున్నాయన్నారు ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రోహనీ