US Helicopter Crashes Video: అమెరికాలో హెలికాఫ్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్.. మియామీ బీచ్‌లో ఘటన..

అమెరికాలో ఓ హెలికాఫ్టర్‌ క్రాష్‌ ల్యాండయింది. మియామీ బీచ్‌లో కుప్పకూలిపోయింది. హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

US Helicopter Crashes Video: అమెరికాలో హెలికాఫ్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్.. మియామీ బీచ్‌లో ఘటన..
Helicopter Crashes Miami Be
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 20, 2022 | 9:58 AM

అమెరికాలో ఓ హెలికాఫ్టర్‌ క్రాష్‌(Helicopter Crashes) ల్యాండయింది. మియామీ బీచ్‌లో(Miami Beach) కుప్పకూలిపోయింది. హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటివరకు బీచ్‌ అంతా సందడిగా ఉంది. పెద్దసంఖ్యలో పర్యాటకులు ఒడ్డున సేదతీరుతున్నారు. కొందరు నీటిలోకి దిగి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది హెలికాఫ్టర్‌. దీంతో చెల్లాచెదురైపోయారు పర్యాటకులు. ఐతే హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యతో కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది.

మియామీ బీచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MBPD) హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. హెలికాప్టర్ వేగంగా కిందికి రావడం.. 10వ నెంబర్ బీచ్‌కు సమీపంలో సముద్రం నీటిలోకి దూసుకెళ్లింది. ఇంజిన్ లో ఏర్పడిన సమస్యలతో హెలిక్యాప్టర్ కుప్పకూలినట్లుగా అధికారులు వెల్లండిచారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఘటనాస్థలికి చేరుకుంది. ప్రమాదంపై దర్యాప్తు మొదలు పెట్టిందని MBPD అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: UP-Punjab Election 2022 Voting Live: ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ అప్‌డేట్ కోసం ఇక్కడ చూడండి..

LAW: తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..