TANA: తానా బోర్డ్ చైర్మన్‌గా డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి.. ఏకగీవ్రంగా ఎంపిక

అంతేకాకుండా అలాగే బేలోర్ కాలేజీ అఫ్ మెడిసిన్‌లో వైద్య విద్యని బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శి గా, ప్రతిష్టాకరమైన తానా- బసవతారకం ప్రాజెక్ట్‌కు ముందుండి తన మార్గదర్శకాలను అందించారు. అలాగే.. కోటి రూపాయిల నిధిని సమకూర్చి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి వైద్య పరికరాల కొనుగోలుకు తానా ఫౌండేషన్ తరుపున అందించటంలో ముఖ్య పాత్ర ఫోషించారు. అలాగే సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాలు అయిన వేద పాఠశాలలు , గోశాలలు, గురుకులాల, దేవాలయాల అభివృద్ధికి ఆర్ధిక వనరులు సమకూర్చటం తో పాటు...

TANA: తానా బోర్డ్ చైర్మన్‌గా డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి.. ఏకగీవ్రంగా ఎంపిక
Nagendra Srinivas Kodali
Follow us

|

Updated on: Aug 13, 2023 | 9:13 AM

ప్రతిష్టాకరమైన తానా బోర్లుకి శనివారం రాత్రి (అమెరికా కాలమాన ప్రకారం) జరిగిన ఎన్నికలలో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారు ఏకగ్రీవంగా బోర్డ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. వారితో పాటు కార్యదర్శి గా శ్రీమతి లక్ష్మి దేవినేని గారు కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జూనీ ) నిమ్మలపూడి గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి.. ప్రపంచ ప్రతిష్టాకరమైన టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో పీడియాట్రిక్ కార్డియోవాస్క్యూలర్ అనేస్తేషలోజి లో డాక్టర్ శ్రీనివాస్ సేవలందిస్తున్నారు.

అంతేకాకుండా అలాగే బేలోర్ కాలేజీ అఫ్ మెడిసిన్‌లో వైద్య విద్యని బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శి గా, ప్రతిష్టాకరమైన తానా- బసవతారకం ప్రాజెక్ట్‌కు ముందుండి తన మార్గదర్శకాలను అందించారు. అలాగే.. కోటి రూపాయిల నిధిని సమకూర్చి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి వైద్య పరికరాల కొనుగోలుకు తానా ఫౌండేషన్ తరుపున అందించటంలో ముఖ్య పాత్ర ఫోషించారు. అలాగే సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాలు అయిన వేద పాఠశాలలు , గోశాలలు, గురుకులాల, దేవాలయాల అభివృద్ధికి ఆర్ధిక వనరులు సమకూర్చటం తో పాటు విశేష సేవలందిస్తున్నారు.

ఇక బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి లక్ష్మి దేవినేని గారు గతంలో తానా బోర్డు కోశాధికారిగా , న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ గా, విమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గానే కాకుండా ఇటీవలే జరిగిన 23 వ తానా మహా సభలలో పలు కమిటీలలో ఆమె సేవలందించారు. బోర్డు కోశాధికారిగా ఎన్నికైన జనార్దన్ నిమ్మలపూడి గారు గతంలో 21వ తానా మహాసభల కార్యదర్శి గా, కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్ గానే కాకుండా కాన్సర్ అవగాహన, నిధుల సమీకరణం కోసం ప్రపంచంలో ఎత్తైన కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించారు అలాగే ఈ మధ్య జరిగిన 23 వ తానా మహాసభలలో ఎన్‌టీఆర్‌ మెమోరియల్ ట్రస్ట్‌కి కోటి రూపాయల నిధిని సమకూర్చడంలో ప్రత్యేక పాత్ర ఫోషించారు.

ఇవి కూడా చదవండి
Tana

 

తానా బోర్డు చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ, తానా ఫౌండేషన్‌ని సమన్వయ పరుచుకుంటూ, సరైన దిశలో మార్గ నిర్దేశం చేస్తూ తానా సేవలను, ప్రతిష్టని సమర్ధవంతంగా మరింత ముందుకు తీసుకెళ్తామని అలాగే బోర్డు అఫ్ డైరెక్టర్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా తానా ని తెలుగు వారికి మరింత చేరువ చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం అని చెప్పుకొచ్చారు.

Janardhan Nimmalapudi, Laxmi devineni

Janardhan Nimmalapudi, Laxmi devineni

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles