నదిలో పడ్డ విమానం.. అమెరికాలో తప్పిన భారీ ప్రమాదం

అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తోన్న బోయింగ్ 737 విమానం.. రన్‌వే నుంచి జారిపడి సమీపంలో ఉన్న సెయింట్ జాన్స్ నదిలో పడిపోయింది. అయితే ఈ విమానం నదిలో మునగకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. 21మందికి గాయాలయ్యాయని జాక్సన్‌విల్లే మేయర్ ప్రకటించారు. వెంటనే సమాచారం అందుకున్న నావికాదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా […]

నదిలో పడ్డ విమానం.. అమెరికాలో తప్పిన భారీ ప్రమాదం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 06, 2019 | 7:13 PM

అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తోన్న బోయింగ్ 737 విమానం.. రన్‌వే నుంచి జారిపడి సమీపంలో ఉన్న సెయింట్ జాన్స్ నదిలో పడిపోయింది. అయితే ఈ విమానం నదిలో మునగకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. 21మందికి గాయాలయ్యాయని జాక్సన్‌విల్లే మేయర్ ప్రకటించారు. వెంటనే సమాచారం అందుకున్న నావికాదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో విమానంలో 136మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.