AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tornadoes: వరుస టోర్నడోలతో అమెరికా అల్లకల్లోలం.. 10 మంది మృతి.. పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టం

అమెరికాలో టోర్నడోల బీభత్సం ఆగడం లేదు. ఈ వీకెండ్‌లో పది టోర్నడోలు అగ్రరాజ్యాన్ని కుదిపేశాయి. తాజాగా అమెరికాలోని దక్షిణ, మధ్య ప్రాచ్య రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల నుంచి పలు జనావాసాలపై విరుచుకుపడ్డాయి. వీటి ధాటికి పలు ..

Tornadoes: వరుస టోర్నడోలతో అమెరికా అల్లకల్లోలం.. 10 మంది మృతి.. పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టం
America Tornadoes
Basha Shek
|

Updated on: Apr 02, 2023 | 6:45 AM

Share

అమెరికాలో టోర్నడోల బీభత్సం ఆగడం లేదు. ఈ వీకెండ్‌లో పది టోర్నడోలు అగ్రరాజ్యాన్ని కుదిపేశాయి. తాజాగా అమెరికాలోని దక్షిణ, మధ్య ప్రాచ్య రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల నుంచి పలు జనావాసాలపై విరుచుకుపడ్డాయి. వీటి ధాటికి పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నివాసాలు, దుకాణ సముదాయాలు నేలమట్టమయ్యాయి. వేల సంఖ్యలో నివాసాలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వివిధ ఘటనల్లో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇండియానా రాష్ట్రంలోని సులివాన్‌ కౌంటీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరి జాడ తెలియట్లేదంటున్నారు అధికారులు. ఆర్కన్సాస్‌ రాష్ట్ర రాజధాని లిటిల్‌ రాక్‌ నగరంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి గాయాలయ్యాయి. ఇల్లినాయ్‌ రాష్ట్రంలోని బెల్విడీర్‌లో సంగీత కార్యక్రమం జరుగుతున్న థియేటర్‌ నేలమట్టమై సందర్శకుల్లో ఒకరు చనిపోతే.. 28 మందికి గాయాలయ్యాయి. భీకర గాలులతో టోర్నడోలు రావడంతో  ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయలని ఓక్లొహోమా నగరంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు.

మరోవైపు టోర్నడోలతో దెబ్బతిన్న రాష్ట్రాలకు ఫెడరల్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. వచ్చే మంగళవారం మరోసారి టోర్నడోలు విరుచుకుపడతాయని అంచనాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..