Arati Prabhakar: భారత మహిళకు మరో అరుదైన గౌరవం.. బైడెన్ సైన్స్ కన్సల్టెంట్‌గా ఆర్తి ప్రభాకర్..

|

Jun 15, 2022 | 6:08 PM

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన సైన్స్ (Science Advisor) సలహాదారుగా.. భారత సంతతికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, వాషింగ్టన్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్తి ప్రభాకర్‌ను ఈ వారంలో నియమించనున్నారు.

Arati Prabhakar: భారత మహిళకు మరో అరుదైన గౌరవం.. బైడెన్ సైన్స్ కన్సల్టెంట్‌గా ఆర్తి ప్రభాకర్..
Arati Prabhakar
Follow us on

Arati Prabhakar: అమెరికాలో మరో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలువురు ఇండో-అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారత మహిళకు కీలక బాధ్యతలు అప్పగించనుండటం విశేషం.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన సైన్స్ (Science Advisor) సలహాదారుగా.. భారత సంతతికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, వాషింగ్టన్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్తి ప్రభాకర్‌ను ఈ వారంలో నియమించనున్నారు. ఆర్తీ ప్రభాకర్‌ను వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (OSTP) డైరెక్టర్‌గా నియమించాలని బైడన్ భావిస్తున్నారు. ఎరిక్ ల్యాండర్ స్థానంలో ఆర్తీ ప్రభాకర్‌ను తీసుకోనున్నారు. ల్యాండర్ ఫిబ్రవరి 7, 2022న రాష్ట్రపతి సైన్స్ సలహాదారు పదవికి రాజీనామా చేశారు.

ఆర్తి ప్రభాకర్ OSTP డైరెక్టర్ కావడానికి సెనేట్ ఆమోదం అవసరం. ఈ ప్రక్రియకు నెలల సమయం పట్టవచ్చు. ఆ తర్వాత ఆమె వెంటనే అధ్యక్షుని సైన్స్ సలహాదారుగా బాధ్యతలు చేపట్టవచ్చు. అనంతరం ప్రెసిడెంట్ బిడెన్స్ క్యాన్సర్ మూన్‌షాట్‌కు ఆర్తీ ప్రభాకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ బాధ్యతలు చేపట్టేవారు సైన్స్ కన్సల్టెంట్‌గా, సైన్స్ పాలసీ సమస్యలను పరిష్కరించడం కూడా ఉంటుంది. చైనాకు పోటీగా అమెరికాను ఎలా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి వంటి అంశాలు కూడా.. ఇందులో ఉంటాయి.

ఆర్తి ప్రభాకర్ ఎవరంటే..?

ఇవి కూడా చదవండి

ఆర్తి ప్రభాకర్ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తగా ఉన్నారు. ఆమె 1993లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రభుత్వంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (NIST)కి అధిపతిగా నియామకమయ్యారు. NIST చీఫ్‌గా నామినేషన్ వేసిన రెండు దశాబ్దాల తర్వాత, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఆర్తి ప్రభాకర్‌ను డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (DARPA) అధిపతిగా నియమించారు. ఓఎస్‌టీపీ డైరెక్టర్‌గా ప్రభాకర్ నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే, ఓఎస్‌టీపీకి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆర్తి ప్రభాకర్ నిలిచిపోనున్నారు.

న్యూఢిల్లీలో పుట్టి.. టెక్సాస్‌లో చదువుకుని..

ఆర్తి ప్రభాకర్ ఫిబ్రవరి 2, 1959న భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం టెక్సాస్‌లో కొనసాగింది. 1984లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పొందిన తరువాత.. ఆర్తి ప్రభాకర్ ఫెడరల్ ప్రభుత్వం తరుపున పనిచేయడం ప్రారంభించారు.

యాక్చుయేట్ వ్యవస్థాపకురాలిగా..

డా. ఆర్తి ప్రభాకర్ జూలై 30, 2012 నుంచి.. జనవరి 20, 2017 వరకు యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీకి అధిపతిగా పనిచేశారు. ప్రభాకర్ లాభాపేక్ష లేని సంస్థ యాక్చుయేట్ (Arati Prabhakar – Actuate Innovation) వ్యవస్థాపకురాలు, CEO గా ఉన్నారు. 1993 నుంచి 1997 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి అధిపతిగా ఉన్నారు. NISTకి అధిపతి అయిన మొదటి మహిళగా ఆర్తి ప్రభాకర్‌ నిలిచారు.

సైన్స్ కన్సల్టెంట్ విధులు ఇవే..

సైన్స్ ఎజెండాను నెరవేర్చడంలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడికి సహాయం చేయడం సైన్స్ సలహాదారు ప్రధాన విధి. జనవరి 15, 2021 నాటి లేఖలో బిడెన్ సైన్స్ ఎజెండాను ప్రకటించారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, అంటువ్యాధుల నుంచి రక్షించడం, అవగాహన కల్పించడం, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి పరిశోధనలు చేయాలని బిడెన్.. అప్పటి లాండర్‌ను కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో దేశం అగ్రగామిగా ఉండేలా చూసేందుకు సైన్స్ కన్సట్టెంట్‌లు ప్రధానంగా పనిచేస్తారు.

మరిన్ని గ్లోబల్ ఇండియన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..