AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New World Screwworm: వామ్మో ఈగ… అమెరికా ఎందుకు వణికిపోతుంది… వేటాడేందుకు రంగంలోకి హెలికాప్టర్లు

ప్రపంచ దేశాలను భయపెట్టే అగ్రరాజ్యం అమెరికాను ఓ ఈగ హడలెత్తిస్తోంది. కొద్ది రోజులగా అమెరికా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌గా పేర్కొనే ఈగ పాడి రైతులకు తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. దీంతో ఈగ కోసం ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని...

New World Screwworm: వామ్మో ఈగ... అమెరికా ఎందుకు వణికిపోతుంది... వేటాడేందుకు రంగంలోకి హెలికాప్టర్లు
New World Screwworm
K Sammaiah
|

Updated on: Jul 12, 2025 | 8:25 AM

Share

ప్రపంచ దేశాలను భయపెట్టే అగ్రరాజ్యం అమెరికాను ఓ ఈగ హడలెత్తిస్తోంది. కొద్ది రోజులగా అమెరికా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌గా పేర్కొనే ఈగ పాడి రైతులకు తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. దీంతో ఈగ కోసం ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్‌ చేసిన మగ ఈగలను సిద్దం చేస్తోంది. ఈ ఈగలు పరాన్న జీవులు కావడంతో ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై వాలుతున్నాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని తింటున్నాయి. దీంతో ఆ జంతువులు ప్రాణాలు విడుస్తున్నాయి. 2023 నుంచి సెంట్రల్‌ అమెరికాలో వీటి సంతతి పెరిగిపోయింది. రోజుకు అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి.

ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు, అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి. ఈగల దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు, పాడి పరిశ్రమలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2023 నుంచి ఇప్పటివరకు దాదాపు 36 వేల న్యూవరల్డ్‌ స్క్రూవార్మ్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్‌ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి.

స్క్రూవార్మ్‌ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్‌ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. యితే, అమెరికాలో స్టెరిలైజేషన్‌ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు. టెక్సాస్‌–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది.

పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం అంత ఈజీ కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలోనూ ఈగలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇంట్లో పెంచుకొనే కుక్కలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి.