‘సాయానికి సిధ్దం, మా కోసం ఇండియా, వారి కోసం మేం,’ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్,

భారత దేశంలో కోవిడ్  పరిస్థితి పై  ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..ఇండియా కోసం తాము ఉన్నామని, తమ కోసం ఇండియా ఉందని  వ్యాఖ్యానించారు.

'సాయానికి సిధ్దం, మా కోసం ఇండియా, వారి కోసం మేం,' అమెరికా అధ్యక్షుడు జోబైడెన్,
We Are Ready To Help To India Says Us President Joe Biden
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 27, 2021 | 10:52 AM

భారత దేశంలో కోవిడ్  పరిస్థితి పై  ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..ఇండియా కోసం తాము ఉన్నామని, తమ కోసం ఇండియా ఉందని  వ్యాఖ్యానించారు. నేడు తాను మోదీతో మాట్లాడానని, మా దేశం అత్యవసర సాయం అందిస్తుందని హామీ ఇచ్చానని ట్వీట్ చేశారు.  అమెరికా 46  వ అధ్యక్షునిగా గత జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను మోదీ ఫోన్  ద్వారా  అభినందించారు.  మళ్ళీ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకోవడం ఇది రెండో సారి. వీరి  మధ్య సంభాషణ సుమారు 45 నిముషాల  కొనసాగింది. ఈ సంక్షోభ సమయంలో  ఇండియాకు అవసరమైన సాయమంతా చేస్తామని బైడెన్ హామీ ఇచ్చినట్టు వైట్ హౌస్ తెలిపింది. భారత అభ్యర్థనపై అమెరికా ఆక్సిజన్,  మందులు, ఇతర వైద్య పరికరాలను అంజేస్తుందని ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు.  ఆక్సిజన్ జనరేషన్ సిస్టంలను ప్రొవైడ్ చేసే అవకాశాలను రక్షణ శాఖ పరిశీలిస్తోందని ఆమె  చెప్పారు.ఫీల్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్స్ ని తాము ఫీల్డ్ మెడికల్ హాస్పిటల్స్  లో వినియోగిస్తున్నామని, వీటిని ఇండియాకు పంపుతామని ఆమె చెప్పారు. వీటిలో ప్రతి యూనిట్ 50 నుంచి 100 బెడ్స్ కి ఆక్సిజన్ సప్లయ్  చేయగలదన్నారు.  ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను,  వెంటిలేటర్లను  కూడా  అమెరికా పంపనుంది.

గత  ఏడాది ఇండియాకు యూఎస్ 200 వెంటిలేటర్ల, శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని పపంపింది. అత్యవసర ప్రాతిపదికపై ఏడు వస్తువులను పంపాలంటూ ఇండియా జాబితా సమర్పించిందని, వాటిని వెంటనే పంపుతున్నామని ఆమె తెలిపారు. భారత అధికారులతో తమ అధికారులు నిరంతరం టచ్ లో ఉంటున్నారన్నారు.  ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికోసం  ముడి  పదార్థాలను పంపుతున్నామని ఆమె  చెప్పారు. ఇప్పటివరకు వీటి ఎగుమతిపై బ్యాన్ ఉంటున్న విషయం గమనార్హం. అయితే దీన్ని అమెరికా ఎత్తివేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Covid 19: భారత్‌లో ఆందోళన కలిస్తోన్న కరోనా.. రూపం మార్చుకుంటున్న మహమ్మారి.. పెరుగుతున్న మరణాలు.. దేనికి సంకేతం?

Watch Video: ఆసుపత్రిలో రగడ.. పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్.. వీడియో వైరల్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.