Spacecraft: అంతరిక్ష యాత్ర ప్రారంభానికి ముందు వ్యోమోగాములు ఏం చేశారో తెలుసా..? అయితే ఈ వీడియో చూడండి
International Space Station: స్పేస్‌ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ క్రాప్ట్‌ను సకాలంలో విడుదల చేసింది. మొదటిసారి రాకెట్, అంతరిక్ష నౌకను రీసైక్లింగ్
International Space Station: స్పేస్‌ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ క్రాప్ట్‌ను సకాలంలో విడుదల చేసింది. మొదటిసారి రాకెట్, అంతరిక్ష నౌకను రీసైక్లింగ్ చేయడం ద్వారా తన మూడో క్రూ సిబ్బందిని అంతరిక్షంలోకి పంపింది. అంతరిక్ష పర్యటన అనంతరం యూఎస్, ఫ్రాన్స్, జపాన్‌ను నలుగురు వ్యోమగాములు ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో ప్యాడ్ 39 ఎ నుంచి ఈస్టర్న్ టైమ్ (0949 జిఎంటి) వద్ద ఉదయం 5:49 గంటలకు షెడ్యూల్ చేయబడిన ప్రయోగానికి ముందు సిబ్బంది ఎలా సమయాన్ని గడుపుతూ.. అంతరిక్ష పర్యటనకు పయనమయ్యారో.. దానికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ విడుదల చేసింది.
అయితే.. ప్రయోగానికి ముందు నలుగురు సభ్యుల బృందం రాక్ పేపర్ సిజర్స్ ఆడుతున్న వీడియోను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ట్వీట్ చేసింది. కాగా.. సిబ్బంది షెడ్యూల్ కంటే ముందుగానే తమ దశలను దాటి ప్రయోగం సఫలికృతం చేశారని తెలిపింది. అంతరిక్ష యాత్ర ప్రారంభానికి ముందు వ్యోమోగాములు క్లాసిక్ హ్యాండ్ గేమ్ ఆడుతూ కనిపించారు.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేసిన ట్విట్..
Rock, paper, scissors!
The crew is going through their steps ahead of schedule and are passing the extra time aboard the Crew Dragon spacecraft with a couple of rounds of the game. pic.twitter.com/1MUSHQUnyi
— International Space Station (@Space_Station) April 23, 2021
ఈ మేరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఓ ట్విట్ చేసింది. సిబ్బంది షెడ్యూల్ కంటే ముందుగానే అడుగులు వేస్తున్నారని తెలిపింది. స్పేస్ సెంటర్ శుక్రవారం ఈ వీడియోను పంచుకున్న నాటినుంచి దీనిని ఆరు లక్షల మంది వీక్షించారు. దీనిని షేర్ చేయడంతోపాటు.. పలు కామెంట్లు సైతం చేస్తున్నారు. కాగా.. కమర్షియల్ క్రూ ప్రోగ్రాం కింద నాసాతో మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా స్పేస్‌ఎక్స్ ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపడం ఇది మూడోసారి. మొదటి మిషన్ గత మేలో ప్రయోగించారు.
Also Read: