Big Egg: ఆ కోడి పెట్టిన గుడ్డులో ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు పచ్చ సొనలు! మరి మతి పోదాండి.. ఎక్కడంటే..
కోడి గుడ్డు సైజు ఎంత ఉంటుంది? అందులో ఎన్ని సొనలు ఉంటాయి? ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా? విషయం అటువంటిది అందుకే ఆ ప్రశ్నలు. కోడిగుడ్డు మహా అయితే గుప్పిటలో పట్టేంత ఉంటుంది. సాధారణంగా ఒకే సొన ఉంటుంది..
Big Egg: కోడి గుడ్డు సైజు ఎంత ఉంటుంది? అందులో ఎన్ని సొనలు ఉంటాయి? ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా? విషయం అటువంటిది అందుకే ఆ ప్రశ్నలు. కోడిగుడ్డు మహా అయితే గుప్పిటలో పట్టేంత ఉంటుంది. సాధారణంగా ఒకే సొన ఉంటుంది.. అప్పుడప్పుడు రెండు సొనలు కూడా ఉండవచ్చు. ఇదే కదా ఆ ప్రశ్నలకు సమాధానం. కరెక్టే అంటారా? ఇంతకు ముందు అయితే, నేను ఇది కరెక్ట్ అనేవాడిని. కానీ, ఇప్పుడు అనలేను.. ఎందుకంటే ఓ కోడి ఏకంగా మూడు సొనలు ఉన్న గుడ్లను పెడుతోంది. సో.. ఈ స్టొరీ చదివాకా ఎవరన్నా పై ప్రశ్న అడిగితే అప్పుడప్పుడు మూడు సొనలు కూడా ఉండవచ్చును అని సమాధానం చెప్పాల్సిందే.. మరి ఆ కోడి ఎక్కడుందో తెలుసుకుందాం పడండి.
మిసెస్ షార్ప్ అనే ఆవిడ సౌత్ యార్క్‌షైర్‌లోని లెట్‌వెల్ గ్రామంలో ఉంటోంది. ఈవిడ అక్కడ పోస్ట్ మాస్టర్ గా చేసి రిటైర్ అయింది. ఈవిడ ఒక డజను కోడి గుడ్లు మూడు డాలర్లు ఇచ్చి కొనుక్కుంది. ఇంటిలో గుడ్డును పగుల గొట్టి హాఫ్ బాయిల్ చేయడానికి చూసింది. గుడ్డు పగలగొట్టిన వెంటనే ఆమెకు మతిపోయినంత పని అయింది. ఆ గుడ్డులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పచ్చ సోనలు ఉన్నాయి. దీంతో ఆమె ఆశ్చర్యపోయి అలాగే దానిని ఫోటో తీసింది. ఎవరికైనా చెబితే నమ్మరేమో అని ఆ పని చేసింది ఆవిడ. అసలు ”’ఒక గుడ్డు షెల్‌లో మూడు సొనలు ఉండే స్థలం ఉందని నేను ఒక్క నిమిషం ఊహించలేదు. మీ డబ్బు ఒకటి ధర కోసం మూడు పొందడం ఖచ్చితంగా విలువ ‘అని మిసెస్ షార్ప్ అన్నారు.
ఈ కోడిగుడ్డు ఈమెకు అమ్మిన వేలాది బ్యాటరీ కోళ్ళను రీహోమ్ చేసిన లూయిస్ అడ్డీ ఈ విషయంపై ఇలా అన్నారు..ఈ కోడి పేరు పెప్పా…దీనికి మూడు సంవత్సరాల వయసు. పెద్ద గుడ్లను ఉత్పత్తి చేసిన రికార్డు ఉంది. ఒక కోడి ట్రిపుల్-పచ్చసొనను వేయడం నాకు తెలియదు.” అన్నారు. ఇక ఈ విషయాన్ని మిసెస్ షార్ప్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. అందరూ ఆ కోడిగుడ్డు ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు.