కోవిడ్ పై పోరు, ఇండియా కన్నా మా అమెరికన్లకే ప్రాధాన్యం, స్పష్టం చేసిన జోబైడెన్ ప్రభుత్వం
కోవిడ్ 19 వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్ధాల ఎగుమతిపై తాము విధించిన ఆంక్షలను అమెరికా ప్రభుత్వం సమర్థించింది. ఈ ఆంక్షల కారణంగా ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో జాప్యం జరుగుతోంది.
కోవిడ్ 19 వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్ధాల ఎగుమతిపై తాము విధించిన ఆంక్షలను అమెరికా ప్రభుత్వం సమర్థించింది. ఈ ఆంక్షల కారణంగా ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో జాప్యం జరుగుతోంది. అయితే మొదట తమ అమెరికన్ల అవసరాలు, వారి ప్రయోజనాలకే తాము ప్రాధాన్యమిస్తామని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి, అధికార ప్రతినిధి కూడా అయిన నెడ్ ప్రెస్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ముడి పదార్థాల ఎగుమతిపై ఆంక్షలను ఎప్పడు ఎత్తివేస్తారన్న ప్రశ్నకు ఆయన..ఈ సమాధానమిచ్చారు. ఈ బ్యాన్ అన్నదాన్ని ప్రస్తుతానికి ఎత్తివేసే యోచన లేదని పరోక్షంగా తెలిపారు. అమెరికన్లకు వ్యాక్సిన్ ఇవ్వడానికే ప్రయారిటీ ఇస్తామని, ఇప్పటివరకు తాము ఈ విషయంలో సక్సెస్ అయ్యాయమని ఆయన చెప్పారు. ప్రపంచంలో మరే దేశాల్లోకెల్లా కోవిడ్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, అయిదున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది మంది ఇన్ఫెక్షన్ కి గురయ్యారని అన్నారు. ఇతర దేశాలు కూడా ఈ విషయాన్నీ గుర్తించాయన్నారు. అమెరికన్లకు మొదట వ్యాక్సినేషన్ అన్నదే లక్ష్యమన్నారు. ఈ ముప్పు ఒక్క అమెరికానే కాక, ఇతర దేశాలను కూడా వేధిస్తోందని, చెప్పారు. ఏమైనా.. ఈ బ్యాన్ ని తొలగించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.
మమ్మల్ని కూడా ఈ రిస్క్ వెన్నాడుతోంది అని చెప్పారు. అమెరికాలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలు దేశీయ వినియోగానికి మొదట ప్రాధాన్యమివ్వాలని చట్టం ఉన్న కారణంగా వ్యాక్సిన్ ముడి పదార్థాల ఎగుమతిపై బ్యాన్ కొనసాగుతోందని భావిస్తున్నారు. ఈ బ్యాన్ ఎత్తివేస్తే ఇండియా వంటి దేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇండియాలో కరోనా వైరస్ కేసులు 3 లక్షలకు పైగా పెరిగిపోయిన విషయాన్నీ తాము గమనించామని, త్వరలో తగిన సాయం చేస్తామని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం ఢిల్లీకి ట్ హామీ ఇచ్చింది.