US Bank: ఒక్క బ్యాంక్‌ను కాపాడేందుకు ముందుకొచ్చిన 11 బ్యాంక్‌లు.. 30 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటన

ఎక్కడైనా అయితే ఓ బ్యాంకు దివాళా తీస్తోందంటే...మిగిలిన బ్యాంకులు పండగ చేసుకుంటాయి. కానీ అమెరికాలో అలా జరగలేదు. అమెరికాలో మునిగిపోతున్న బ్యాంకుని నిలబెట్టేందుకు అన్ని బ్యాంకులూ ఏకతాటిపైకి వచ్చాయి.

US Bank: ఒక్క బ్యాంక్‌ను కాపాడేందుకు ముందుకొచ్చిన 11 బ్యాంక్‌లు.. 30 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటన
First Republic Bank

Updated on: Mar 18, 2023 | 8:15 AM

అమెరికాలో ఒక్క బ్యాంకుని కాపాడేందుకు 11 బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. పతనావస్థలో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్ బ్యాంకుని రక్షించేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించాయి. ఎక్కడైనా అయితే ఓ బ్యాంకు దివాళా తీస్తోందంటే…మిగిలిన బ్యాంకులు పండగ చేసుకుంటాయి. కానీ అమెరికాలో అలా జరగలేదు. అమెరికాలో మునిగిపోతున్న బ్యాంకుని నిలబెట్టేందుకు అన్ని బ్యాంకులూ ఏకతాటిపైకి వచ్చాయి. పతనావస్థలో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్‌ అనే బ్యాంకుని కాపాడేందుకు అమెరికాలోని 11 బ్యాంకులు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభాన్ని నివారించేందుకు బడాబ్యాంకులన్నీ నడుంకట్టాయి. 11 బ్యాంకులు కలిసికట్టుగా 30 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి.

అమెరికాలో బ్యాంకింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అవి మాత్రమే కాదు…మరికొన్ని బ్యాంకులూ అదే బాటలో ఉన్నాయి. ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌ కూడా దివాళాతీస్తోంది. దీంతో మరోసారి 2008 నాటి లేమన్‌ బ్రదర్స్‌ స్థాయి సంక్షోభం ముంచెత్తనుందా అన్న అనుమానం అమెరికన్‌ ఆర్థిక వేత్తలను వెంటాడుతోంది.

డిసెంబరు 31 నాటికి ఈ బ్యాంకులో 176.4 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, బ్యాంకింగ్‌ వ్యవస్థపై వస్తున్న వదంతులతో ఖాతాదారులు ఇటీవల భారీ ఎత్తున నగదును ఉపసంహరించుకుంటుండడంతో బ్యాంకు దివాళాతీసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..