Viral News: అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం.. తెరపైకొచ్చిన సరికొత్త వాదనలు.. అసలేం జరిగిందంటే?
Sandy Island: లగేజీ, కారు, మొబైల్ మాయమవడం గురించి మీరు చాలా సార్లు వినే ఉంటారు. కానీ.. ఓ ద్వీపం మాయమైందన్న విషయం ఎప్పుడైనా విన్నారా..
Trending News: ఏదైనా లగేజీ, కారు, మొబైల్ మాయమవడం గురించి మీరు చాలా సార్లు విని ఉంటారు. అలాగే చూసి ఉంటారు కూడా. కానీ, మీరు ఎప్పుడైనా ఒక ద్వీపం అదృశ్యం(Sandy Island Missing) గురించి విన్నారా. మాయమైన ద్వీపం కూడా చిన్నది కాదు. అది ఏకంగా 22 కిలోమీటర్ల పొడవు ఉండడం విశేషం. నిజంగా ఈ వార్త(Viral News) చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. కానీ, గత కొన్ని రోజులుగా ఈ వార్త చాలా చర్చనీయాంశమైంది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న శాండీ ద్వీపం గత కొంత కాలంగా వార్తల్లో నిలిచింది. ఈ ద్వీపాన్ని 2 శతాబ్దాల క్రితం గుర్తించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచ పటంలో ఉంటుంది. కానీ వాస్తవానికి అలాంటిదేమీ లేదని నిరూపితమైంది. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపం 1774లో ఆమోదించారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈ పేరును వింటూనే ఉన్నారు. కానీ, ప్రస్తుతం అలాంటి ద్వీపం లేదనే మిస్టరీ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి, ఈ ద్వీపాన్ని బ్రిటిష్ కెప్టెన్ జేమ్స్ కుక్ కనుగొన్నట్లు పేర్కొన్నారు. అయితే అప్పుడు దానికి ఫాంటమ్ ఐలాండ్స్ ట్రూత్ అని పేరు పెట్టారు. కొంతకాలం క్రితం వరకు ఇది గూగుల్ మ్యాప్‌లో కూడా ఉంది. తరువాత చాలా పరిశోధనల తర్వాత ఇది నకిలీ అని తేలింది. ప్రస్తుతం Google Maps నుంచి కూడా తీసివేశారు. దీంతో ఆనాటి వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి.
నివేదిక ప్రకారం, కెప్టెన్ జేమ్స్ కుక్ ఈ ద్వీపం 22 కి.మీ పొడవు, 5 కి.మీ వెడల్పుతో ఉందని పేర్కొన్నాడు. ఇది ఆస్ట్రేలియా ఒడ్డున ఉందని తెలిపాడు. అంతే కాదు, 1876లో వెలాసిటీ అనే ఓడ కూడా ఈ ద్వీపాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఇది 19వ శతాబ్దంలో బ్రిటన్, జర్మనీ మ్యాప్‌లలో కూడా ఉంది. ప్రస్తుతం హఠాత్తుగా కనుమరుగైపోవడంతో పలు విషయాలపై చర్చ జరుగుతోంది.
Covid-19: కరోనా లక్షణాలు లేకుంటే.. ఐసోలేషన్ అవసరం లేదు.. ఆ దేశంలో ఆంక్షలు ఎత్తివేత