ఎంజాయ్ చేద్దామని సముద్ర తీరానికి వెళ్లారు.. కట్ చేస్తే.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగో పరుగు.. అసలేం జరిగిందంటే..?

సముద్రం తీరానికి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన పర్యాటకులను అలలు కమ్మేశాయి. సెకను పాటులో మింగేసంత పనిచేశాయి. వెంచురా ప్రాంతంలో భారీగా అలలు తీరాన్ని తాకడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో రాకాసి అలలు భయపెడుతున్నాయి. సునామీ తరహాలో ఎగసిపడుతున్నాయి.

ఎంజాయ్ చేద్దామని సముద్ర తీరానికి వెళ్లారు.. కట్ చేస్తే.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగో పరుగు.. అసలేం జరిగిందంటే..?
Pacific Ocean
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 31, 2023 | 8:28 AM

సముద్రం తీరానికి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన పర్యాటకులను అలలు కమ్మేశాయి. సెకను పాటులో మింగేసంత పనిచేశాయి. వెంచురా ప్రాంతంలో భారీగా అలలు తీరాన్ని తాకడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో రాకాసి అలలు భయపెడుతున్నాయి. సునామీ తరహాలో ఎగసిపడుతున్నాయి. ఉరుములు మెరుపులతో పసిఫిక్ మహాసముద్రం అలజడిగా మారింది. రాకాసి అలలు 20 నుంచి 40 అడుగులు ఎగసి పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు రావచ్చని అధికారులు అప్రమత్తమయ్యారు. అలలు వేగంగా తీరాన్ని తాకుతుండడంతో వరద వచ్చే ముప్పు ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జరీ చేసింది. దీంతో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు అధికారులు. మారీస్ కౌంటీ, కాపిటోలాను ఖాళీ చేయాలని హెచ్చరికలు జరీ చేసారు.

అటు సాన్ డియాగో ప్రాంతం లోను అత్యంత భారీ అలలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జరీ చేసింది. సముద్రం ఒడ్డున ఎవరూ ఊండొద్దని విజ్ఞప్తి చేసారు. సముద్రం ఒడ్డుకుకూడా వెళ్లవద్దని సూచించారు.

వీడియో చూడండి..

మరో నగరం లాస్ ఏంజెల్స్ కూడా అలల ప్రమాదం పొంచిఉందని చెప్పింది వాతావరణశాఖ. లాస్ ఏంజెల్స్ ప్రజలు అలలు, వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

నేషనల్ వెదర్ సర్వీస్ అధికారులు అలలు 28 నుంచి 33 అడుగుల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల 40 అడుగుల ఎత్తులో కూడా అలలు ఎగసిపడే అవకాశం ఉందని చెప్పారు.ఇప్పటికే సముద్రానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకాసి కెరటాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..