AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన తల్లి.. కట్‌చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్!

అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు తనను కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన ఓ తల్లికి కొడుకు ఊహించని షాక్ ఇచ్చాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోగా.. తన తల్లితో తనకు ఉన్న లైంగిక సంబంధం గురించి అతను పోలీసులకు చెప్పేశాడు. ఇదే విషయాన్ని పోలీసులు అతని తల్లిని అడగ్గా, అది నిజమేనని ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇద్దరిపై ఇన్సెస్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కొడుకు కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన తల్లి.. కట్‌చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్!
Mother Son Illegal Relationship Expose In America
Anand T
|

Updated on: Sep 18, 2026 | 12:52 PM

Share

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు కొడుకు. తల్లి ఫిర్యాదుతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఆ యువకుడు తన తల్లితో అతనికి ఉన్న లైంగిక సంబంధం గురించి చెప్పేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడా రాష్ట్రంలో లేక్‌ల్యాండ్‌కు చెందిన క్రిస్టినా క్లెమెన్స్ (46) అనే మహిళ స్థానికంగా తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తోంది. అయితే, 22 ఏళ్ల వయస్సున్న తన కొడుకుతో ఆమె లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. తాజాగా కొడుకు తనను కొడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

ఈ కేసు వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ ఓ అధికారి ఇలా అన్నారు.. క్రిస్టినా అనే మహిళ తనను తన కొడుకు కొడుతున్నాడని ఫోన్ చేస్తే.. అతన్ని తాము అదుపులోకి తీసుకున్నామని, అయితే ఆ యువకుడు తమకు దిమ్మతిరిగే విషయం చెప్పాడని తెలిపారు. తనకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి తన తల్లితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నానని ఆ యువకుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. మొదట ఆ యువకుడు చెప్పిన మాటలు విని షాక్ అయ్యామని.. దీని గురించి మళ్లీ చెప్పమని అడగ్గా, అదే విషయాన్ని ఆ యువకుడు మళ్లీ రిపీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

అయితే కొడుకు చెప్పింది ఎంత వరకు నిజమో అని తెలుసుకునేందుకు ఇదే విషయంపై అతని తల్లిని విచారించగా.. ఆమె కూడా అది నిజమేనని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాము కేవలం 100 సార్లు మాత్రమే ఏకాంతంగా గడిపినట్టు ఆమె చెప్పిందని పోలీసులు తెలిపారు. అలాగే ఈ విషయంపై ఆమె భర్తను విచారించగా.. తల్లీకొడుకుల మధ్య ఉన్న ఈ సంబంధం గురించి తనకు తెలియదని అతను చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే వాళ్లు ఇద్దరూ ఇంట్లోని మాస్టర్ బెడ్‌రూమ్‌లో తలుపులు వేసుకుని ఏకాంతంగా ఎక్కువ సమయం గడిపినప్పుడు తనకు కొంత అనుమానం వచ్చిందని అతను చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.

తల్లీకొడుకులు ఇలాంటి సంబంధం కలిగి ఉండడం చట్టవిరుద్ధమని పేర్కొన్న షెరీఫ్ జుడ్.. వారిద్దరిపై ఇన్సెస్ట్ కేసులు నమోదు చేశామని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. తల్లి క్రిస్టినాపై గృహ హింస, బహిరంగ వివాహేతర సంబంధం అభియోగాలు ఉన్నట్టు తేలిందని, సెప్టెంబర్ 4న ఆమె మొత్తం 6,250 డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారని తెలిపారు. మరోవైపు షేన్‌పై గృహ హింసకు పాల్పడినందుకు అదనపు అభియోగాలు నమోదయ్యాయని, అతను ప్రస్తుతం ఎలాంటి బెయిల్ లేకుండా పోలీసు కస్టడీలోనే ఉన్నట్టు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us