ఇండియాను వెంటనే ఆదుకుంటాం, బ్లింకెన్ తో సమావేశంలో యూఎస్ లోని 135 మంది సీఈవోల హామీ

కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాను యుధ్ధ ప్రాతిపదికన ఆదుకునేందుకు  అమెరికా రంగంలోకి దిగింది.  అధ్యక్షుడు జోబైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ   ఇద్దరూ ఫోన్ లో మాట్లాడిన కొన్ని గంటలకే అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్..

ఇండియాను వెంటనే ఆదుకుంటాం, బ్లింకెన్ తో  సమావేశంలో యూఎస్ లోని 135 మంది సీఈవోల హామీ
Us State Secretary Blinken
Umakanth Rao

| Edited By: Phani CH

Apr 27, 2021 | 2:47 PM

కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాను యుధ్ధ ప్రాతిపదికన ఆదుకునేందుకు  అమెరికా రంగంలోకి దిగింది.  అధ్యక్షుడు జోబైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ   ఇద్దరూ ఫోన్ లో మాట్లాడిన కొన్ని గంటలకే అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్..తమ దేశంలోని 135 మంది టాప్ సీఈఓలతో సమావేశమయ్యారు.  గూగుల్, ఐబీఎం, జేపీ మోర్గాన్, నూవీన్ ల్యాబ్స్,  జె అండ్  జె  సంస్థలతో బాటు ఇతర సంస్థల  అధిపతులంతా  ఇందులో  పాల్గొన్నారు. ఇండియాలో తలెత్తిన కోవిడ్ తీవ్రత గురించి తమకు తెలుసునని, ఈ తరుణంలో ఆ దేశానికి సాయపడేందుకు తాము చేయవలసిన కృషి అంతా చేస్తామని వారు హామీ ఇచ్చారు.  ఇది   ఇండియానే కాకుండా  ప్రపంచ దేశాలకు  కూడా పెను ముప్పు వారు అభిప్రాయపడ్డారు. అమెరికా విదేశాంగ శాఖ..మెడికేషన్, ఎయిడ్, ఈక్విప్ మెంట్ వంటివాటిపై -ఆర్డినేషన్ కి శ్రీకారం చుట్టింది. యునైటెడ్, డెల్టా   వంటి సంస్థలు మందులు  తదితరాలను ఇండియాకు  చేర్చేందుకు తమ విమానాలు రెడీగా  ఉన్నాయని పేర్కొన్నాయి .

ఇండియాలో  వ్యాక్సిన్ల లభ్యతకు అనుగుణంగా ప్రభుత్వం, ఆరోగ్య  శాఖ  ఆస్ట్రాజెనికా మందులను ఇండియాకు  పంపుతున్నాయి.అమెరికా లోని వార్ ఫీల్డ్ హాస్పిటల్స్ నుంచి అదనంగా ఉన్న ఆక్సిజన్ ఈక్విప్ మెంట్ ను ఇండియాకు మళ్లిస్తు న్నారు. భారత్ లో సాయపడేందుకు గూగుల్ ఇదివరకే తనవంతుగా 300 కోట్లకు పైగా సాయాన్ని ప్రకటించింది. ఇండియాలోని చిన్న నగరాలూ, పట్టణాలకు వైద్య పరికరాలు  మొదలైనవి తరలించేందుకు లాక్ హీడ్ మార్టిన్ హెలికాఫ్టర్లను, కార్గో విమానాలను పంపుతోంది. ఇండియాలో   ఖాళీగా ఉన్న తమ కార్యాలయాలను వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకోవడానికి అమెరికాలోని  సంస్థలు అనుమతించాయి. డబ్బు, వైద్య పరికరాలే కాదు, తమకు మానవతా దృక్పథం కూడా ఉందని అమెరికా నిరూపించుకుంటోంది. ఇండియాలో కోవిడ్ ని, ముఖ్యంగా భారత వేరియంట్ ని అదుపు చేయకపోతే .. మే నెలాఖరు నాటికీ ఇది ప్రపంచాన్నే కబళిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2021: 37 బంతులతో తుఫాను సెంచరీ.. విరాట్ కోహ్లీ ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌కు ఛాన్స్ ఇస్తాడా.?

AP High Court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం.. కరోనా రిపోర్టు అలస్యమైతే రోగి పరిస్థితి ఏంటన్న న్యాయస్థానం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu