H1B Visa: అమెరికా వెళ్తున్న భారతీయులకు షాకింగ్ న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా బైడెన్‌ సర్కార్ అడుగులు..

అమెరికా వెళ్లాలని అనుకుంటున్న భారతీయులకు షాక్‌ తగిలింది. వీసా ఫీజులను భారీగా పెంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌-1 బీ వీసాలతో సహా అన్ని రకాల వీసా ఫీజులను పెంచాలని నిర్ణయించారు. హెచ్‌-1 బీ వీసాలతో సహా అన్ని రకాల వీసా ఫీజులను పెంచాలని నిర్ణయించారు...

H1B Visa: అమెరికా వెళ్తున్న భారతీయులకు షాకింగ్ న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా బైడెన్‌ సర్కార్ అడుగులు..
Us Visa

Updated on: Jan 05, 2023 | 8:39 PM

అమెరికా వెళ్లాలని అనుకుంటున్న భారతీయులకు షాక్‌ తగిలింది. వీసా ఫీజులను భారీగా పెంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌-1 బీ వీసాలతో సహా అన్ని రకాల వీసా ఫీజులను పెంచాలని నిర్ణయించారు. హెచ్‌-1 బీ వీసాలతో సహా అన్ని రకాల వీసా ఫీజులను పెంచాలని నిర్ణయించారు. వీసా ఫీజులను ఏకంగా 200 శాతానికిపైగా పెంచేందుకు కసర్తత్తు మొదలైంది. అమెరికా వీసా ఫీజులు మరోసారి పెంచేందుకు బైడెన్‌ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో వీసా దరఖాస్తు ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్‌ సర్కారు ప్రతిపాదనలు సిద్దం చేసింది. హెచ్‌-1బీ సహా పలు రకాల వీసా దరఖాస్తు ధరలు మరింత పెరగబోతున్నాయి.

ఇమ్మిగ్రేషన్‌ ఫీజుల పెంపు ప్రతిపాదనలను అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ధరను 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచారు. ఎల్‌-1 వీసా ధర 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. O-1 వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. హెచ్‌-2బీ వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. తాజా ప్రతిపాదనలను 60 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంచి.. జనం అభిప్రాయాలను స్వీకరిస్తారు. 60 రోజుల తరువాత కొత్తగా పెంచిన ఫీజులు అమల్లోకి వస్తాయి.

అసలు కారణం ఇదే..

ఈ నిర్ణయంతో పెండింగ్‌ వీసాల సంఖ్య కూడా తగ్గే అవకాశముందని యూఎస్‌సీఐఎస్‌ అధికారులు చెబుతున్నారు. యూఎస్‌సీఐఎస్‌కు 96శాతం నిధులు.. వీసా దరఖాస్తు ఫీజుల ద్వారానే వస్తున్నాయి. కరోనా విజృంభణ 2020లో వీసా దరఖాస్తులు భారీగా తగ్గాయి. దీంతో ఏజెన్సీ ఆదాయం 40శాతానికి పైగా పడిపోయింది. నిధుల లేమి కారణంగా.. ఏజెన్సీలో నియామకాలు నిలిపివేశారు. సిబ్బందిని కూడా తగ్గించారు. దీంతో పెండింగ్‌ వీసా దరఖాస్తులు పెరిగాయి. అందుకే వీసా ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..