AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన నెల్లూరు వాసి…

అమెరికాలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వాసి సత్తా చాటారు. నెల్లూరు జిల్లాకు చెందిన చలంచెర్ల ఏడుకొండలు ఘన విజయం సాధించారు. కాలిఫోర్నియా

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన నెల్లూరు వాసి...
Ravi Kiran
|

Updated on: Nov 06, 2020 | 8:59 PM

Share

అమెరికాలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వాసి సత్తా చాటారు. నెల్లూరు జిల్లాకు చెందిన చలంచెర్ల ఏడుకొండలు ఘన విజయం సాధించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో కౌన్సిల్‌ మెంబర్‌గా ఎన్నిక అయ్యారు. నెల్లూరు జిల్లా విడవలూరులోని సామాన్య గిరిజన కుటుంబంలో ఏడుకొండలు జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు ఇదే గ్రామంలో చదువుకున్న ఏడుకొండలు.. ఆ తర్వాత ఎస్వీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చదివారు. అనంతరం యూనివర్సిటీలో కో- ఆపరేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాత సివిల్స్ రాసి ఐఈఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కొన్నాళ్ల పాటు ఇండియాలోనే పనిచేశారు. ఈ సమయంలోనే ఐఏఎస్ అధికారి కుమార్తెను వివాహం చేసుకున్నారు.

Also Read: పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..

తర్వాత ఏడుకొండలు కొన్నాళ్ల పాటు సింగపూర్‌లో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ సిటీలో స్థిరపడ్డారు. అక్కడే అవుతార్ ఐటీ సొల్యూషన్ స్థాపించి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఏడుకొండలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 200 మంది గిరిజన విద్యార్థులను చదివిస్తున్నారు. సొంతూరు విడవలూరులోనూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం అందించారు. అమెరికా ఎన్నికల్లో తమ ప్రాంత వాసి విజయం సాధించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!

Follow Us
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
పిల్లలే కాదు,పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతది
పిల్లలే కాదు,పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతది
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు..!
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు..!
Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త..!
Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త..!
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..