AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నన్నే కరుస్తావా నీ అంతు చూస్తా.. కాటేసిన పామును ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఒళ్ళు గగుర్పొడిచే వింత ఘటన వెలుగుచూసింది. తనను కాటేసిన పాముపై ఆగ్రహంతో ఫరూఖ్ అనే యువకుడు ఆ పాము తలనే కొరికేశాడు. అనంతరం ఆ పామును చేతిలో పట్టుకుని, వాహనాలు దొరకకపోవడంతో ఏకంగా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: నన్నే కరుస్తావా నీ అంతు చూస్తా.. కాటేసిన పామును ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే..
West Bengal Snake Bite News
Anand T
|

Updated on: Jul 14, 2026 | 1:20 PM

Share

సాధారణంగా పాములు మనుషులపై పగ తీర్చుకుంటాయనడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ మనిషి కోపంతో పాముపై పగతీర్చుకోవడం మీరెప్పుడైనా విన్నారా? లేదు కదూ! కానీ ఇక్కడో వ్యక్తి అదే చేసి చూపించాడు. అవును, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. తనను కాటేసిందనే కోపంతో ఆ వ్యక్తి ఏకంగా పామునే కొరికేశాడు. తర్వాత ఆ పామును అలాగే పట్టుకొని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌కు నడుచుకుంటూ వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా, మోతాబారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న ఫరూఖ్ అనే యువకుడు తన ఇంటి సమీపంలో పనిచేస్తుండగా అతన్ని ఓ పాము కాటేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫరూఖ్, వెంటనే ఆ పామును పట్టుకుని దాని తలను కొరికేసినట్టు సమాచారం. ఆ తర్వాత అదే పామును పట్టుకొని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు బయలుదేరాడు. అయితే అతను వెళ్లాల్సిన హాస్పిటల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అతని చేతిలో ఉన్న పామును చూసి ఎవరూ ఫరూఖ్‌ను తమ వాహనాల్లో ఎక్కించుకోలేదు. దీంతో సుమారు 4 కిలోమీటర్లు అతను నడుచుకుంటూనే హాస్పిటల్‌కు చేరుకున్నాడు.

అక్కడి వైద్యుల దగ్గరకు వెళ్లి ఈ పాము తనను కాటేసిందని.. అందుకే తాను కూడా పామును కొరికేశానని అతను తెలిపాడు. అది విన్న వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే అతనికి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us