Kamala vs Trump: ఆమె కంటే నేనే అందంగా ఉంటా.. కమలాపై ట్రంప్ పర్సనల్ అటాక్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మునుపెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికల ప్రచార స్థాయి దిగజారిపోయిందంటూ అక్కడి మీడియా వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు.

Kamala vs Trump: ఆమె కంటే నేనే అందంగా ఉంటా.. కమలాపై ట్రంప్ పర్సనల్ అటాక్..!
Donald Trump, Kamala Harris
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 18, 2024 | 5:36 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మునుపెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత విమర్శలు వినిపిస్తున్నాయి.  ఎన్నికల ప్రచార స్థాయి దిగజారిపోయిందంటూ అమెరికాతో సహా అంతర్జాతీయ మీడియా వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. కమలా హారిస్ కంటే తానే ఎంతో అందంగా ఉంటానంటూ పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఆమె నవ్వు భయంకరంగా ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ అందంగా ఉంటారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ కాలమ్‌పై స్పందిస్తూ ట్రంప్ ఇలా తన అసహనం వ్యక్తంచేశారు.

ట్రంప్ ఏమన్నారో వీడియోలో చూడండి..

అటు కమలా హారిస్ ఆర్థిక విధానాలపైనా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాలో కమ్యూనలిజం సిద్ధాంతాలను తీసుకొస్తామంటూ కమలా హారిస్ శుక్రవారంనాడు చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ అభ్యంతరం వ్యక్తంచేశారు. కమలా కామెంట్స్‌కు అభ్యంతరం తెలుపుతూ సోషల్ మీడియాలో ట్రంప్ ఓ పోస్ట్ షేర్ చేశారు.

ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తుండటం తెలిసిందే. మూడు వారాల ముందు నుంచే కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. కమలా హారిస్ నల్ల జాతీయురాలా? భారతీయ సంతితికి చెందిన వ్యక్తో చెప్పాలంటూ గతంలో ప్రశ్నించారు. తనపై కూడా కమలా హారిస్ తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసిందని.. అందుకే తాను ఆమెనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ట్రంప్ తన నోటిదురుసును సమర్థించుకున్నారు.

ఈ ఏడాది నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు నెలలకు పైగా టైమ్ ఉంది. అప్పుడే ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలతో కంపు రేపుతున్నారు. ముందు ముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని మీడియా వర్గాలు అంచనావేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..