Prince Charles: ప్రిన్స్ ఛార్లెస్‌కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్‌లోకి బ్రిటన్ యువరాజు..

UK Prince Charles: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు పుట్టుకొస్తున్న కరోనా (Coronavirus) వేరియంట్లు

Prince Charles: ప్రిన్స్ ఛార్లెస్‌కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్‌లోకి బ్రిటన్ యువరాజు..
Prince Charles

Edited By: Phani CH

Updated on: Feb 11, 2022 | 9:23 AM

UK Prince Charles: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు పుట్టుకొస్తున్న కరోనా (Coronavirus) వేరియంట్లు పలు దేశాల్లో అలజడి రేపుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. సోకిన వారికే మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బ్రిటన్ యువరాజు చార్లెస్‌ (Prince Charles) రెండోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షలో రెండోసారి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బ్రిటన్ (United Kingdom) యువరాజు ఛార్లెస్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు ఛార్లెస్ కార్యాలయం గురువారం వెల్లడించింది. ఈ మేరకు ఛార్లెస్.. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్విట్ చేశారు. తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. దీంతో ఇంగ్లాండ్‌లోని వించెస్టర్‌ను షెడ్యూల్ ప్రకారం సందర్శించలేకపోతున్నందుకు నిరాశతో ఉన్నానని పేర్కొన్నారు. అయితే.. ఇంతకు మించిన ఇతరత్రా వివరాలను ఆయన పంచుకోలేదు.

ఇదిలా ఉంటే.. ఛార్లెస్ (73) బుధవారం సాయంత్రం బ్రిటిష్ మ్యూజియం వద్ద జరిగిన కార్యక్రమంలో చాలామందిని కలిశారు. ప్రస్తుతం వారిని కూడా అధికారులు అప్రమత్తం చేసినట్లు పేర్కొంటున్నారు. కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉండాలని, ఏమైనా లక్షణాలు ఉంటే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

కాగా.. ఛార్లెస్‌కు 2020 మార్చిలో కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పట్లో ఛార్లెస్‌తోపాటు ఆయన సతీమణి కెమిల్లా రెండవ ఎలిజెబెత్ రాణికి చెందిన స్కాట్లాండ్‌లోని బల్‌మోరల్ ఎస్టేట్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. అంతేకాకుండా ఈ వారం స్పెయిన్ రాజు ఆరవ ఫెలిపే, డెన్మార్క్ రాణి రెండవ మార్గరేట్ లకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Also Read:

Covid 19 Deaths: ఆ 88 దేశాల్లో కరోనాతో ఎంత మంది భారతీయులు మృతి చెందారో తెలుసా? అంతులేని విషాదం..

Corona Virus: కరోనా నిబంధనలకు, వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ నిరసనలు..భారతీయులకు పలు సూచనలు చేసిన హైకమీషన్