గత ఏడాది మొదలైన రష్యా – ఉక్రెయిన్ యుద్దం ఇప్పటికీ ముగిసిపోలేదు. యుద్ధం మొదలైన కొన్ని నెలలకి రష్యా – క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై భారీ పేలుడు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ దాడి ఎవరూ చేశారన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ ఆ వంతెనపై జరిగిన దాడిపై స్పందించింది. ఆ దాడి చేసింది మేమేనని అంగీకరించింది. ఉక్రెయిన్ నిఘా సంస్థ చీఫ్ వాసిల్ మాల్యుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాటలు ఆ దేశంలోని టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. మేం ఎన్నో ఆపరేషన్లు నిర్వహించామని.. అందులో విజయం సాధించిన తర్వాత వాటి వివరాలు బహిరంగంగా చెప్పగలమని అన్నారు. 2021లో అక్టోబర్ 8 న క్రిమియా వంతెనపై జరిగిన దాడి కూడా మా ఆపరేషన్లలో ఒకటి అని తెలిపారు.
గత ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 70 వ పుట్టినరోజు చేసుకున్న మరునాడే క్రిమియా వంతెనపై దాడి జరిగింది. ఈ బ్రిడ్జిపై వెళ్తున్న ట్రక్కులో బాంబు ఒక్కసారిగా పేలడంతో సమీపంలో ఉన్న రైలు వంతెనపై చమురు ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ దాడిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం కృషి చేస్తోన్న రష్యా.. 2014లోనే క్రిమియాను తన సొంతం చేసుకుంది. అనంతరం 2018లో 3 బిలియన్ డార్లు ఖర్చు చేసి.. రష్యా క్రిమియాను కలిపేలా రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. గత ఏడాది ఈ దాడి జరిగిన తర్వాత దీనికి తాము కారణం కాదని చెప్పిన ఉక్రెయన్.. ఇప్పుడు తామే చేశామని చెప్పడం చర్చనీయాంశమైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.