తగ్గేదేలే.. చర్చలంటూనే దాడులు.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం..! ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. ఎవరివారే యుద్ధంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండటంతో.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అయితే.. చర్చలకు సానుకూలంగా అంటూ రష్యా, ఉక్రెయిన్ పైకి చెబుతున్నా.. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతూనే ఉండటం ఇరు దేశాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. ఎవరివారే యుద్ధంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండటంతో.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అయితే.. చర్చలకు సానుకూలంగా అంటూ రష్యా, ఉక్రెయిన్ పైకి చెబుతున్నా.. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతూనే ఉండటం ఇరు దేశాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత 24గంటల్లో ఉక్రెయిన్‌పై తమ బలగాలు చేసిన దాడుల్లో 1,430 మందికి పైగా ఆ దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనాలు, ఫిరంగి తుపాకులను ధ్వంసం చేశామన్నారు. మరో వైపు మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం దాదాపు 1 మిలియన్ రష్యన్ సైనికులను హతమార్చిందని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఆఫీస్ ప్రకటించింది. యుద్ధంలో మొత్తం 9,90,800 మంది రష్యన్ సైనికులు మరణించారని.. అందులో 1,100 మంది సైనికులు గత 24 గంటల్లో మరణించారని పేర్కొంది.
ఇంతకాలంగా యుద్ధంలో రష్యాది పైచేయి కాగా.. ఇటీవల ఉక్రెయిన్ కూడా ఊహించని విధంగా రష్యాపై ప్రతిదాడులకు దిగింది. మొన్న రష్యాపై డ్రోన్స్ తో విరుచుకుపడి ఊహించని షాక్ ఇచ్చిన ఉక్రెయిన్.. లేటెస్ట్‌గా రష్యాలోని కీలక బ్రిడ్జిని కూల్చేసినట్లు ప్రకటించింది. 1100 కిలోల పేలుడు పదార్థంతో రష్యాలోని రోడ్డు, రైలు బ్రిడ్జ్ పేల్చేశామని తెలిపింది. 19 కిలోమీటర్ల పొడవున్న క్రిమియా బ్రిడ్జిని అండర్ వాటర్ లో పిల్లర్లను టార్గెట్ చేస్తూ పేల్చేసినట్లు చెప్పింది.
2022, 2023లో కూడా క్రిమియా బ్రిడ్జిని పేల్చేశామని.. ఇప్పుడు కూడా అదే విధంగా అండర్ వాటర్ బాంబుతో బ్రిడ్జిని పేల్చేశామని ప్రకటించాయి ఉక్రెయిన్ సెక్యూరిటీ బలగాలు. ఈ ఆపరేషన్‌ను కొంతకాలంగా ప్లాన్ చేసి అమలు చేసినట్టు తెలిపాయి. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసింది ఉక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్స్.
రష్యా దళాలు క్రిమియా బ్రిడ్జిపై నుంచే ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ బ్రిడ్జిని పేల్చాలని ఉక్రెయిన్ చాలాకాలంగా ప్లాన్ చేస్తోంది. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలవ్వగా.. అప్పటి నుంచి రష్యాకు ఈ బ్రిడ్జి కీలకంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు ఈ బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్.. మంగళవారం దీన్ని పేల్చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
