అగ్ర రాజ్యం అమెరికా సమయంలో ఉక్రెయిన్ నిరంతరం రష్యా పై విరుచుకుపడుతోంది. రష్యాలోని ప్రధాన నగరాలపై బాంబు దాడి చేస్తోంది. విధ్వంసక క్షిపణులను ఉపయోగించడానికి బిడెన్ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడమే కాదు… ఉక్రెయిన్ కు ఆయుధ సహాయం కూడా చేస్తోన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్ మరింత ఘోరంగా రష్యాపై విరుచుకుపడుతోంది. నివేదికల ప్రకారం.. క్రెయిన్ శనివారం రష్యాపై 9/11 తరహా దాడి చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ కజాన్‌లోని 6 భవనాలపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి తరువాత ఈ మొత్తం ప్రాంతమంతా గందరగోళం నెలకొంది.
దాడి తర్వాత భవనాలను ఖాళీ చేయించారు. పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. దాడి తర్వాత సహాయక చర్యలు జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ దాడి జరిగింది. సమీపంలోని విమానాశ్రయం మూసివేయబడింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఉక్రెయిన్ సైన్యం సుమారు 8 డ్రోన్లతో కజాన్‌లోని 6 భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ నిరంతర దాడుల కారణంగా ఈ నగరంలోని ప్రజలు భూగర్భ ఆశ్రయాలలో నివసించవలసి వస్తుంది. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కజాన్ నగర మేయర్ కోరారు.
⚡️ Drones attack Kazan high-rise building, residents evacuated pic.twitter.com/p6ZBHoRjqj
— RT (@RT_com) December 21, 2024
ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రోన్‌లు కమలేవ్ అవెన్యూ, క్లారా జెట్‌కిన్ స్ట్రీట్, యుకోజిన్స్‌కయా, ఖాదీ తక్తాష్ , క్రాస్నాయా పొజిట్సియాలోని భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఓరెన్‌బర్గ్‌స్కీ ట్రాక్ట్ స్ట్రీట్‌లోని ఓ భవనాన్ని మరో రెండు డ్రోన్‌లు టార్గెట్ చేశాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు అయినట్లు సమాచారం లేదు. దాడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు.
చేయబడ్డాయి
దాడి తరువాత రష్యాలోని టాటర్స్తాన్ ప్రాంతం ప్రభుత్వం రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని సామూహిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఉక్రెయిన్ చేస్తోన్న దాడులను రష్యా తేలిగ్గా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయనే భయం కనిపిస్తోందని అంటున్నారు. అయితే ప్రతి దాడికి తగిన సమాధానం చెబుతామని రష్యా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన ఈ దాడికి రష్యా ఏం సమాధానం చెబుతుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..