UK PM Rishi Sunak: అలా చేయడం పొరపాటే.. క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్..

|

Jan 20, 2023 | 1:26 PM

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మరోసారి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది ముమ్మాటికి తప్పే అంటూ ఒప్పుకున్నారు. అసలు ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందంటే..

UK PM Rishi Sunak: అలా చేయడం పొరపాటే.. క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్..
Rishi Sunak
Follow us on

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మరోసారి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది ముమ్మాటికి తప్పే అంటూ ఒప్పుకున్నారు. అసలు ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందంటే.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సీటు బెల్టు పెట్టుకోకుండా కారులో ప్రయాణించడం కాస్త వివాదంగా మారడంతో.. ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కారు వెనుక సీట్లో కూర్చున్న దేశ అభివృద్ధికి సంబంధించి తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో కారులో అలా ఎలా ప్రయాణిస్తారని.. సీటు బెల్టు ఎందుకు పెట్టుకోలేదంటూ కొందరు పనిగట్టుకుని మరి విమర్శించడం మొదలు పెట్టారు. దీంతోపాటు సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారు. అది కాస్త వివాదంగా మారి విమర్శలు వెల్లువెత్తడంతో రిషి సునాక్ క్షమాపణాలు చెప్పాల్సి వచ్చింది.

బ్రిటన్ (యూకే) చట్టాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 500 పౌండ్ల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంటే మన కరెన్సీతో పోలిస్తే.. రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై యూకే లాంకషైర్ పోలీసులు స్పందిస్తూ.. ప్రధాని రిషి సునాక్ సీటు బెల్టు పెట్టుకోకుండా.. ప్రయాణించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

అయితే, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో.. ఇది పూర్తి తప్పిదంగా రిషి సునాక్ అంగీకరించినట్టు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ప్రకటించారు. ఇందుకు ప్రధాని సునాక్ క్షమాపణలు చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలనే ప్రధాని కోరుకుంటారు. కాకపోతే నిర్ణయంలో చోటు చేసుకున్న చిన్న తప్పిదం ఇది. వీడియో క్లిప్ కోసం స్వల్ప సమయం మాత్రమే సీట్ బెల్ట్‌ను తొలగించారు. అది పొరపాటుగా ఆయన అంగీకరించారు.. అంటూ ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి ప్రకటనలో తెలిపారు.

వీడియో చూడండి..

కాగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొంతకాలంలోనే.. పలు నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవ్వడంతో రిషి సునాక్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..