ప్రజల ఆరోగ్యం కోసం యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి వాటి ప్రచారానికి నో ఛాన్స్‌

జంక్‌ ఫుడ్‌.. ఎంతో ఇష్టంగా తినే ఆహారం. అయితే వీటి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు జంక్‌ ఫుడ్‌ కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం జంక్‌ ఫుడ్‌ను వదులుకోలేకపోతుంటారు. అందులోనూ...

ప్రజల ఆరోగ్యం కోసం యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి వాటి ప్రచారానికి నో ఛాన్స్‌
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 28, 2020 | 6:59 PM

UK govt key decision on junk food: జంక్‌ ఫుడ్‌.. ఎంతో ఇష్టంగా తినే ఆహారం. అయితే వీటి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు జంక్‌ ఫుడ్‌ కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం జంక్‌ ఫుడ్‌ను వదులుకోలేకపోతుంటారు. అందులోనూ వ్యాపార సంస్థలు జంక్‌ ఫుడ్‌పై అందించే ఆఫర్లు కూడా ప్రజలను వీటివైపు ఆకర్షించేలా చేస్తాయి. అయితే తమ దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్‌ నుంచి జంక్‌ ఫుడ్‌ను ప్రమోట్‌ చేసేలా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని నిర్ణయించింది. ముఖ్యంగా కొవ్వు, చక్కెర, ఉప్పు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ వంటి ఆహార పదార్థాలకు ‘ఒకటి కొంటే మరొకటి ఉచితం’ లాంటి ప్రకటనలను ఉండకూడదని తాజాగా తేల్చిచెప్పింది. ప్రజల ఆరోగ్యం కాపాడటానికి.. ఒబెసిటీని పూర్తిగా నిర్మూలించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్రిటన్‌లో సుదీర్ఘకాలం నుంచి ఒబెసిటీ సమస్యతో ప్రజలు బాధపడుతున్నారు. అధిక బరువు కారణంతో మూడో వంతు చిన్నారులు ప్రైమరీ స్కూల్స్‌కు వెళ్లడం మానేస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే బ్రిటన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.