AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నా అవి తప్పనిసరి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమెరికా వైద్యులు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ వస్తోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్‌ అందజేయడం ప్రారంభమైంది. మన దేశంలోనూ డ్రైరన్‌లను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయి. అయితే...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నా అవి తప్పనిసరి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమెరికా వైద్యులు.
Narender Vaitla
|

Updated on: Dec 28, 2020 | 8:00 PM

Share

You May spread COVID-19 after vaccination: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ వస్తోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్‌ అందజేయడం ప్రారంభమైంది. మన దేశంలోనూ డ్రైరన్‌లను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇక వ్యాక్సిన్‌ తీసుకున్నాం.. ఇన్ని రోజుల నుంచి నోటికి అడ్డుగా పెట్టుకున్న మాస్కులను ఎంచక్కా పక్కన పెట్టేయొచ్చని అనుకుంటున్నారా? అయితే అలా చేయడానికి వీల్లేదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమిస్తుందా అన్ని కోణంలో పరిశోధన జరిపిన అమెరికా వైద్యులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతానికి వ్యాక్సిన్‌లు వైరస్‌పై ప్రభావితం చూపుతున్నాయనడానికి ఆధారాలున్నా.. టీకా వేసుకున్న వ్యక్తి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందదన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు తమకు తెలియకుండానే తమ శరీరంలోని వైరస్‌ను ఇతరులకు అంటించే ప్రమాదం ఉందనేది వారి వాదన. అందుకే వ్యాక్సినేషన్‌ చేసుకున్నా.. మాస్క్‌లు ధరించడం, సోషల్‌ డిస్టెంట్స్‌ పాటించడం ఆపకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తుల శరీరాల్లోకి వైరస్‌ మళ్లీ వెళ్లే అవకాశముంటుంది. అయితే అది వ్యాక్సిన్‌ వేసుకున్న వారిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపకపోయినా.. ఇతరులకు ఇబ్బందిగా మారే అవకాశముందని చెబుతున్నారు. అందులోనూ వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తులకు మరోసారి వైరస్‌ సోకినట్లు లక్షణాలు కూడా కనిపించవు. కాబట్టి వ్యాక్సిన్‌ వేసుకున్నామన్న ధీమాతో మునపటిలా జీవితాన్ని ఇప్పుడే ప్రారంభించకపోవడమే బెటర్‌ అని నిపుణులు సూచిస్తున్నారు.

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా