నీరవ్ మోదీకి యూకే కోర్టు ఝలక్..

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నిలువునా మంచిన నీరవ్ మోదీకి యూకే కోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రస్తుతం యూకే దర్యాప్తు సంస్ధ కస్టడీలో ఉన్న నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది యూకే కోర్టు. ప్రస్తుతం నీరవ్ వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నారు. వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజా తీర్పుతో .. నీరవ్ మోదీ ఆగస్టు 22 వరకు జైల్లో ఉండక […]

నీరవ్ మోదీకి యూకే కోర్టు ఝలక్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 25, 2019 | 5:41 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నిలువునా మంచిన నీరవ్ మోదీకి యూకే కోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రస్తుతం యూకే దర్యాప్తు సంస్ధ కస్టడీలో ఉన్న నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది యూకే కోర్టు. ప్రస్తుతం నీరవ్ వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నారు. వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజా తీర్పుతో .. నీరవ్ మోదీ ఆగస్టు 22 వరకు జైల్లో ఉండక తప్పని పరిస్థితి.