Earthquake: సిరియా, టర్కీ సరిహద్దుల్లో భారీ భూకంపం.. 10 మంది మృతి.. వందలాది భవనాలు నేలమట్టం..

|

Feb 06, 2023 | 9:16 AM

సిరియా, టర్కీ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రతకు సిరియా దేశంలోని అనేక భవనాలు కుప్పకూలాయి. సిరియాలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Earthquake: సిరియా, టర్కీ సరిహద్దుల్లో భారీ భూకంపం.. 10 మంది మృతి.. వందలాది భవనాలు నేలమట్టం..
Earthquake
Follow us on

సిరియా, టర్కీ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రతకు సిరియా దేశంలోని అనేక భవనాలు కుప్పకూలాయి. సిరియాలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైనట్లు సిరియా పేర్కొంది. టర్కీలో కూడా భవనాలు కూలిపోయాయని.. ఇప్పటివరకు 10 మరణాలు నమోదయినట్లు వార్త సంస్థలు నివేదించాయి. సిరియా, టర్కీతో పాటు లెబనాన్, ఇరాక్, ఇజ్రాయిల్, పాలస్తీనా, సైప్రస్, గ్రీస్‌, జోర్డాన్‌ దేశాల్లోనూ భూకంపం ప్రభావం చూపించింది.

టర్కీలో సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదయిందని జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ వెల్లడించింది. నుర్దగీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని.. పేర్కొంది.

ఇవి కూడా చదవండి

చాలా దేశాల్లో భూప్రపంపనలు చోటుచేసుకున్నాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. కాగా, భూకంప ప్రభావంతో జరిగిన నష్టానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టర్కీ, సిరియా సరిహద్దుల్లో ఈ భూకంపం సంభించింది. కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించడంతో అందరూ ఇళ్లలోనుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం నెట్టింట భూకంపానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..