AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను అరెస్ట్ అవుతా.. ఆందోళన చేయాలంటూ మద్దతుదారులకు ట్రంప్ పిలుపు

అమెరికా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మంగళవారం రోజున అరెస్టు చేసే అవకాశాలున్నాయని.. అందుకోసం తన మద్ధతుదారులందరూ పెద్దఎత్తున నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.

నేను అరెస్ట్ అవుతా.. ఆందోళన చేయాలంటూ మద్దతుదారులకు ట్రంప్ పిలుపు
Donald Trump
Aravind B
|

Updated on: Mar 19, 2023 | 12:17 PM

Share

అమెరికా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మంగళవారం రోజున అరెస్టు చేసే అవకాశాలున్నాయని.. అందుకోసం తన మద్ధతుదారులందరూ పెద్దఎత్తున నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. 2016లో ఎన్నికలకు ముందు ఓ పోర్న్ స్టార్ కి డబ్బులు ఇచ్చాననే ఆరోపణ నేపథ్యంలో ఈ విషయంపై ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్ నెట్ వర్క్ లో శనివారం పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో దుమారం రేపుతోంది. స్టార్మీ డెనియల్స్ అనే పోర్న్ నటీ తనతో ట్రంప్ కు కొన్నేళ్ల క్రితం లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే ఈ విషయం ప్రజలకు తెలియకుండా ఆపేందుకు ట్రంప్ ఆమెకు లక్ష 30 వేల డాలర్లు 2016 ఎన్నికలకు ముందు చెల్లించి ప్రలోభాలు పెట్టినట్లు ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి.

దీంతో మన్‌హట్టన్‌ జిల్లా అటార్ని కార్యాలయం నుంచి అనధికారికందగా వచ్చిన సమాచారం ప్రకారం ఈనెల 21 న తాను అరెస్టయ్యేలా ఉన్నాయని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే స్టార్మీ డెనియల్స్ తో తనకు లైంగిక సంబంధాలున్నాయన్న ఆరోపణలను ట్రంప్ ఇదివరకే తోసిపుచ్చారు. అయితే ట్రంప్ లాయర్ మాత్రం.. మన్ హట్టన్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్ పై నేరారోపణ చేసినట్లైతే ఆయన లొంగిపొతారని సీఎన్ బీసీ అనే సంస్థకు తెలిపారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని జో బైడెన్‌ దొంగిలించుకుపోయారని మరోసారి ఆరోపిస్తూ  దేశాన్ని మళ్లీ మునుపటి స్థితికి తెచ్చేందుకు నిరసనలు తెలపాలని ట్రంప్ తన అనుచరులకు విజ్ఞప్తిచేశారు. ఒకవేళ ట్రంప్ పై మన్‌హట్టన్‌ జిల్లా అటోర్నీ నేరారోపణ చేసినట్లైతే.. మొదటిసారి నేరారోపణనలు ఎదుర్కొన్న అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం