AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్

భారత్‌ను బలహీనపర్చే కుట్రతో అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్తాన్ మార్గాన్ని ఎంచుకున్నట్టు స్పష్టమైంది. భారత్‌, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాలను అస్థిరపరిచేందుకు ఆ దేశం కుట్ర పన్నింది. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులను కూడా వెచ్చించింది. ఈ రహస్యాన్ని స్వయానా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు. తన కంటే ముందు అధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్ హయాంలో ఈ కుట్ర జరిగిందని వెల్లడించారు.

భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్
India PM Modi, US President Donald Trump
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 10, 2025 | 11:57 AM

Share

ఉగ్రవాద కార్యాకలాపాలు, నకిలీ కరెన్సీ సహా వివిధ మార్గాల్లో భారతదేశాన్ని అస్థిరపర్చడమే తమ విదేశీ విధానంగా పెట్టుకున్న దేశం పాకిస్తాన్. తమ నేలపై ఉగ్రవాదులను తయారుచేసి, వారికి సైనిక శిక్షణనిచ్చి, అధునాతన మారణాయుధాలు అందజేసి భారత్‌లో విధ్వంసాలకు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్తాన్ మార్గాన్ని ఎంచుకున్నట్టు స్పష్టమైంది. భారత్‌, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాలను అస్థిరపరిచేందుకు ఆ దేశం కుట్ర పన్నింది. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులను వెచ్చించింది. ఈ రహస్యాన్ని స్వయానా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు. తన కంటే ముందు అధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్ హయాంలో ఈ కుట్ర జరిగిందని వెల్లడించారు. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు మిత్రదేశాలకు వివిధ రూపాల్లో సహాయం అందించడం కోసం ఉద్దేశించిన “యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్” (USAID) నిధులను తమ రాజకీయ ఎజెండాను అమలు చేయడం కోసం దుర్వినియోగం చేశారని ట్రంప్ ధ్వజమెత్తారు.

ట్రంప్ ఏమన్నారంటే?

అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు USAID నుంచి 260,000,000.00 డాలర్ల నిధులను అందించారని, ఈ నిధులతో అల్లర్లు, అశాంతి సృష్టించి తద్వారా ప్రభుత్వాలను మార్చడం కోసం వినియోగించారని ట్రంప్ ఆరోపించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, యూకేతో పాటు అమెరికాలోనూ ప్రభుత్వాలను మార్చడం కోసం వినియోగించారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. అంతకంటే ముందు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే USAID బడ్జెట్‌ను ఫ్రీజ్ చేసి స్క్రూటినీ ప్రారంభించారు.

బైడెన్ హయాంలో USAID దుర్వినియోగంపై ట్రంప్ ట్వీట్…

జార్జ్ సోరోస్ ఎవరు?

హంగేరియన్-అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ అంతర్జాతీయంగా మీడియా సంస్థలకు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు నిధులను సమకూర్చుతూ ఉంటారు. ఇందుకు ప్రతిఫలంగా తమ ఎజెండాకు తగ్గట్టు కథనాలను తయారుచేసి ప్రచురిస్తుంటారు. వివిధ దేశాల్లో తమకు నచ్చని ప్రభుత్వాలు ఉంటే, వాటిని గద్దె దించడం కోసం ప్రభుత్వ వ్యతిరేక కథనాలు తయారు చేయడం, అక్కడి ప్రతిపక్షాలకు నిధులు సమకూర్చి కృత్రిమ ప్రజాందోళనలు సృష్టించడం ఇందులో భాగమే. భారత ఉపఖండంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లో తలెత్తిన ప్రజాందోళనలు, అనంతరం ప్రభుత్వాల మార్పు ప్రపంచమంతా చూసింది.

ఇక భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రూపొదించడం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి విమర్శనాస్త్రాలు అందించి ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దశాబ్దకాలంగా ఎన్నో జరిగాయి. అందులో “ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP)” ఒకటి. దీనిపై సమగ్ర కథనం ఈ లింక్‌లో చదవచ్చు.

అలాంటి జార్జ్ సోరోస్‌కు బైడెన్ నేతృత్వంలోని గత డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం ధారాళంగా నిధులు సమకూర్చింది. గత 15 ఏళ్ల కాలంలో USAID నుంచి 270 మిలియన్ డాలర్ల సొమ్మకు సోరోస్ నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకు చేరిందని తేలింది. ఈ నిధులతో విదేశాల్లో తమకు నచ్చని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, స్వదేశంలో రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు తయారు చేయడం కోసం కూడా వినియోగించినట్టు ఆరోపణలున్నాయి.