AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vietnam Boat Accident Video: పడవ మునిగి 34 మంది జలసమాధి… వియత్నాంలో ఘోర ప్రమాదం!

వియత్నాంలో ఘోర ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా విరుచుకుపడిన తుపానులో టూరిస్ట్‌ బోటు పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 34 మంది జలసమాధి అయ్యారు, మరో ఎనమిది మంది గల్లంతయ్యారు. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హా లాంగ్‌ బే ప్రాంతంలో శనివారం పగలు ఈ ప్రమాదం...

Vietnam Boat Accident Video: పడవ మునిగి 34 మంది జలసమాధి... వియత్నాంలో ఘోర ప్రమాదం!
Vietnam Boat Accident
K Sammaiah
|

Updated on: Jul 20, 2025 | 8:39 AM

Share

వియత్నాంలో ఘోర ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా విరుచుకుపడిన తుపానులో టూరిస్ట్‌ బోటు పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 34 మంది జలసమాధి అయ్యారు, మరో ఎనమిది మంది గల్లంతయ్యారు. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హా లాంగ్‌ బే ప్రాంతంలో శనివారం పగలు ఈ ప్రమాదం జరిగింది. వియత్నాం సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 11 మందిన కాపాడగలిగారు. గల్లంతయిన వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ‘ది వండర్‌ సీ’బోటులో 48 మంది టూరిస్టులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. అకస్మాత్తుగా సంభవించిన తుపాను కారణంగా పెనుగాలులు వీశాయి. ఆ గాలుల ధాటికి పడవ ఒక్కసారిగా బోల్తాపడినట్లు తెలుస్తోంది. వియత్నాం రాజధాని హనోయీ నుంచి 20 మంది చిన్నారులతో కూడిన కొన్ని కుటుంబాలు పర్యాటనకు వెళ్లారు.

హా లాంగ్‌ బే ప్రాంతాన్ని ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. సతతహరిత అరణ్యాలకు, అందమైన నీలిరంగు బీచ్‌లకు ఈ ప్రాంతం ప్రసిద్ది. వారాంతం కావడంతో ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడికి పర్యాటకులు వచ్చి సేదతీరుతుంటారు. అనుకోని ఈ దుర్ఘటన పర్యాటకుల్లో తీవ్రం భయభ్రాంతులకు గురి చేసింది.

రెండేళ్ల క్రితం సైతం హా లాంగ్‌ బే సమీప ఖ్వాంగ్‌నిన్‌ ప్రావిన్సును యాగీ టైఫన్‌ అతలాకుతలం చేసంది. ఆనాడు ఈ ప్రావిన్సులో 30 పడవలు బోల్తాపడి నీటమునిగాయి. ఈ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారడం సాధారణమని ఇక్కడి స్థానికులు చెప్పారు. మరోవైపు వచ్చే వారం హా లాంగ్‌ బే తీర ప్రాంతాన్ని విఫా తుపాను తాకొచ్చని జాతీయ వాతావరణ అంచనా విభాగం అలర్ట్‌ జారీ చేసింది.

వీడియో చూడండి: