ఫిట్‌గా ఉండాలనే తపనతో చాలా మంది వ్యక్తులు సన్నగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడుతుంటారు. ఇందుకోసం వారు తమ కోరికలను త్యాగం చేస్తుంటారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ, వయస్సు పెరిగే కొద్దీ వారి శరీరాన్ని బ్యాలెన్స్‌డ్ చూసుకుంటారు. ఫిట్‌నెస్ నియమావళికి కట్టుబడి ఉంటారు. కొంతమంది యవ్వనంగా కనిపించడానికి కాస్మెటిక్ విధానాలను ఎంచుకుంటారు. కానీ, వారు తమ వయస్సును మార్చుకోలేరు. కానీ, ఆశ్చర్యకరంగా, ఒక మధ్య వయస్కుడైన సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన వయస్సును తగ్గించుకునే పనిలో పడ్డాడు. అమెరికాకు చెందిన 45 ఏళ్ల సాఫ్ట్‌వేర్ మిలియనీర్ 18 ఏళ్ల వ్యక్తిగా కనిపించాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకోసం ఏడాదికి 16.3కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు.
కాలిఫోర్నియాలోని వెనిస్‌కు చెందిన 45 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ ఒక అల్ట్రావెల్తీ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు, ప్రాజెక్ట్ ‘బ్లూప్రింట్’ ద్వారా తన బాహ్యజన్యు వయస్సును 5.1 సంవత్సరాలు తగ్గించుకున్నట్లు పేర్కొన్నాడు. జాన్సన్ తన ప్రాజెక్ట్ ద్వారా 18 ఏళ్ల యువకుడి అవయవాలు, ఆరోగ్యాన్ని పొందినట్టుగా పేర్కొన్నాడు. ఇటీవలి బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, జాన్సన్‌లో 30 మంది వైద్యులు, వైద్య నిపుణుల బృందం అతని శరీర పనితీరును పర్యవేక్షిస్తారు. జాన్సన్ ప్రతి అవయవంలో వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టడానికి వీరంతా కృషి చేస్తున్నారు. ఇందుకోసం జాన్సన్ నివాసంలో ఏకంగా ఒక మెడికల్ సూట్‌ను ఏర్పాటు చేశారు.
2 yrs of Blueprint:
.5.1 yrs epigenetic age reversal (world record)
.slowed my pace of aging by 24%
.perfect muscle & fat (MRI)
.50+ perfect biomarkers
.100+ markers < chronological age
.fitness tests = 18yr old
.Body runs 3F° coolerAvailable to all: https://t.co/Ye5mQPH9NH
— Bryan Johnson (@bryan_johnson) January 18, 2023
మరోవైపు 18 ఏళ్ల యువకుడిగా మారేందుకు జాన్సన్ ప్రతి రోజూ ఖరీదైన వైద్య విధానాలు పాటిస్తున్నాడు. దీని కోసం ఏడాదికి ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యం పొందాడు. కాగా, జాన్సన్ శరీరంలోని అన్ని అవయవాల వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టి 18 ఏళ్ల వ్యక్తి శరీరంతోపాటు అవయవాలుగా తీర్చిదిద్దడానికి తాను కట్టుబడి ఉన్నట్లు డాక్టర్ ఆలివర్ జోల్మాన్ పేర్కొన్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, నరాలు, దంతాలు, చర్మం, జుట్టు, మూత్రాశయం, పురుషాంగం సహా అన్ని శరీర భాగాలు, అవయవాలను 18 ఏళ్ల యువకుడి మాదిరిగా జాన్సన్ కోరుకుంటున్నట్లు చెప్పారు. దీని కోసం ఈ ఏడాది రెండు మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ఆయన భావిస్తున్నారని వెల్లడించారు.
KernelCo అనేది మెదడు-యంత్ర ఇంటర్‌ఫేస్‌లను రూపొందించే సాంకేతిక సంస్థ. ఇది ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్న సంస్థ, 2016లో స్థాపించబడింది. ఈ ప్రాజెక్ట్‌ను అనుసరించి, జాన్సన్ ఖచ్చితమైన నియమావళిని అనుసరిస్తున్నాడని, శాకాహార ఆహారానికి కట్టుబడి ఉంటాడని వార్తా ఔట్‌లెట్ నివేదించింది. అతను ఒక గంట పాటు వ్యాయామం చేస్తాడు. రోజుకు 1,977 కేలరీలు వినియోగిస్తాడు. ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకుంటాడు.
అతను ఉదయం 5 గంటలకు రెండు డజన్ల సప్లిమెంట్లు, క్రియేటిన్, కొల్లాజెన్ పెప్టైడ్‌లతో కూడిన గ్రీన్ జ్యూస్‌తో ప్రారంభిస్తాడు. డాక్టర్‌ల బృందం రోజంతా జాన్సన్‌ని పర్యవేక్షిస్తుంది. MRIలు, అల్ట్రాసౌండ్‌లు, ఇతర వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. అయితే హృదయ స్పందన రేటు, శరీర కొవ్వు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రతిరోజూ చెక్ చేస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..