సిరియాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సైనిక వాహనంపై దాడి.. ముగ్గురు మృతి, 10మందికి గాయాలు

సైనికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు సిరియన్ సైనికులు మరణించారు.

సిరియాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సైనిక వాహనంపై దాడి.. ముగ్గురు మృతి, 10మందికి గాయాలు
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2021 | 8:31 AM

సిరియా దేశంలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అదును చూసి సైనికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు సిరియన్ సైనికులు మరణించారు. మిలటరీ సిబ్బంది బస్సులో పల్‌మైరా నుంచి డియర్ ఎజ్‌జార్‌కు వెళుతుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఇది గమనించేలోపే ముగ్గురు ఆర్మీ జవాన్లు అక్కడికి అక్కడే మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియా దేశంలోని అల్ షోలా పట్టణ సమీపంలో ఈ ఘటన జరిగింది.

గత ఏడాది డిసెంబరు 30వతేదీన పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది మృత్యువాతపడగా.. మరో 13 మంది గాయాల పాలయ్యారు. దక్షిణ సిరియాలోని టాన్స్ ప్రాంతంలో జోర్డాన్ సరిహద్దుల్లో అమెరికా మిలటరీ దళాలు నియంత్రిస్తున్నాయి.