లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్లో ఆందోళనలు.. కరోనా పరీక్ష కేంద్రాలకు నిప్పుపెట్టిన నిరసనకారులు
లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్లో ఆందోళనలు రాజుకుంటున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున
Lockdown Clashed : లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్లో ఆందోళనలు రాజుకుంటున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు కారణమైంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు పోలీసులు.
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో విధించిన లాక్డౌన్, కర్ఫ్యూలను నెదర్లాండ్స్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. రాజధాని అమెస్టర్డామ్, దక్షిణ నగరమైన ఎయిధోవెన్లలో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఉర్క్ అనే మత్స్యకార గ్రామంలో శనివారం రాత్రి కర్ఫ్యూని వ్యతిరేకిస్తూ స్థానికులు తిరుగుబాటు చేశారు. సమీపంలోని హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన కరోనా వైరస్ పరీక్ష కేంద్రంలోకి కొందరు యువకులు చొరబడి నిప్పుపెట్టారు.
అమెస్టర్డామ్లో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. ఎయిధోవెన్లో జల ఫిరంగులతో పాటు, బాష్పవాయువు కూడా ప్రయోగించారు. 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 3,600 మందికి ఆదివారం జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. లాక్డౌన్కు వ్యతిరేకంగా ఇంతకుముందు ఆదివారం కూడా ప్రజలు ఆందోళన చేపట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు.