Wild Horse: అక్కడ 16వేల అడవి గుర్రాలను కాల్చి చంపనున్న ప్రభుత్వం.. ఈ నిర్ణయం వెనుక రీజన్ ఏమిటంటే

|

Oct 30, 2023 | 9:08 PM

గుర్రాల సంఖ్యను తగ్గించడానికి ఉద్యానవన అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అడవి గుర్రాలను చంపడం లేదా వీటిని వేరే ప్రదేశాలకు పంపిస్తున్నారు. అయితే ఈ చర్యలు ఇకపై సరిపోవని న్యూ సౌత్ వేల్స్ పర్యావరణ మంత్రి పెన్నీ షార్ప్ అన్నారు. భారీ సంఖ్యలో ఉన్న అడవి గుర్రాలు పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా మారాయని దీంతో ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మంత్రి అన్నారు.

Wild Horse: అక్కడ 16వేల అడవి గుర్రాలను కాల్చి చంపనున్న ప్రభుత్వం.. ఈ నిర్ణయం వెనుక రీజన్ ఏమిటంటే
Australia Wild Horse
Follow us on

ప్రకృతి సమతుల్యత తప్పని సరి. చీమల నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకూ ఎక్కువైనా, తక్కువైనా సరే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. ఆలా ఎక్కువైన జంతువులను  తగ్గించడానికి ఆస్ట్రేలియా దారుణమైన నిర్ణయం తీసుకుంది. అడవి గుర్రాల సంఖ్య ఎక్కువయ్యాయని కాల్చి చంపేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటిని హెలికాప్టర్ల నుంచి కాల్చి చంపేయనున్నారు. నేషనల్ పార్క్‌లో వీటి సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని కోస్కియుస్కో నేషనల్ పార్క్‌లో దాదాపు 19,000 అడవి గుర్రాలు ఉన్నాయి. వీటిని “బ్రంబీస్” అని పిలుస్తారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర అధికారులు 2027  నాటికి ఈ అడవి గుర్రాల సంఖ్యను 3,000కి తగ్గించాలనుకుంటున్నారు. అందుకే గుర్రాలను చంపాలనే నిర్ణయాన్ని అంగీకరించారు.

గుర్రాల సంఖ్యను తగ్గించడానికి ఉద్యానవన అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అడవి గుర్రాలను చంపడం లేదా వీటిని వేరే ప్రదేశాలకు పంపిస్తున్నారు. అయితే ఈ చర్యలు ఇకపై సరిపోవని న్యూ సౌత్ వేల్స్ పర్యావరణ మంత్రి పెన్నీ షార్ప్ అన్నారు. భారీ సంఖ్యలో ఉన్న అడవి గుర్రాలు పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా మారాయని దీంతో ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మంత్రి అన్నారు. ఫెరల్ గుర్రాల జనాభా గత 20 సంవత్సరాలుగా వేగంగా పెరిగింది. ఇవి నీటిని అధికంగా తాగుతున్నాయి. అంతేకాదు ఇతర జంతువుల నివాసాలను నాశనం చేస్తాయి.

వేగంగా పెరుగుతున్న గుర్రాల సంఖ్య

గత సంవత్సరం NSW ప్రభుత్వం ప్రచురించిన గణాంకాల ప్రకారం జాతీయ ఉద్యానవనంలో ఈ అడవి గుర్రాల జనాభా 18,814 వరకు ఉంది. వీటి సంఖ్య రెండు సంవత్సరాల క్రితం 14,380మాత్రమే.. ఇక 2016లో ఈ పార్కులో 6000 గుర్రాలు మాత్రమే ఉన్నాయి. రోజు రోజుకీ గుర్రాల జనాభా పెరుగుతుండడంతో పటిష్టమైన చర్యలు చేపట్టకుంటే వచ్చే దశాబ్దంలో అడవి గుర్రాల సంఖ్య 50,000కు పెరుగుతుందని పర్యావరణ సంఘాలు గతంలో పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

బ్రంబీలు ఎలా పర్యావరణానికి హాని చేస్తాయంటే

బ్రంబీస్ లేదా అడవి గుర్రాలు జలమార్గాలు, బుష్‌ల్యాండ్‌ను నాశనం చేస్తున్నాయి. నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇవి కరో బోరీ కప్పలను, అరుదైన ఆల్పైన్ ఆర్కిడ్‌లతో సహా స్థానిక వన్యప్రాణులను చంపేస్తున్నాయి. ఈ అడవి గుర్రాల నియంత్రణ కోసం NSW ప్రభుత్వం గ్రౌండ్ షూటింగ్, ట్రాపింగ్, రీహోమింగ్‌పై ఆధారపడుతుంది. అయితే ఈ చర్యలు సరిపోవడం లేదు. అందుకే NSW పర్యావరణ మంత్రి పెన్నీ షార్ప్ ఆగష్టులో ఏరియల్ షూటింగ్ ప్రతిపాదనపై పబ్లిక్ ఒపీనియన్ ను సేకరించడం ప్రారంభించారు.

రాష్ట్రం పందులు, జింకలతో సహా ఇతర అడవి జంతువుల కోసం ఏరియల్ షూటింగ్‌ని ఉపయోగిస్తుంది. హెలికాప్టర్‌ల నుంచి ఏ సమయంలో షూటింగ్ చేస్తారనే విషయంతో సహా కొన్ని ప్రణాళికలను ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది. ప్రణాళికను సవరించాలనే ప్రతిపాదనపై 11,002 సమర్పణలు వచ్చాయి. వాటిలో 82 శాతం మంది ఏరియల్ షూటింగ్‌కు మద్దతు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..