Area 51 News: అమెరికా ఆర్మీ క్యాంప్‌పై ఏలియన్స్‌ చక్కర్లు..?.. ప్రచారంలో నిజమెంత..?

|

Jul 07, 2021 | 8:38 PM

ఆ తల్లి నవమాససాలు మోసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిని ఎంతో ప్రేమానురాగాలతో పెంచుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ తల్లి మతిస్తిమితం కోల్పోయింది. తండ్రి...

Area 51 News: అమెరికా ఆర్మీ క్యాంప్‌పై ఏలియన్స్‌ చక్కర్లు..?.. ప్రచారంలో నిజమెంత..?
Aliens In Us
Follow us on

ఏలియన్స్‌.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే దేశం పేరు అమెరికా. అవును.. ఏలియన్స్‌తో యూఎస్‌ దోస్తానా చేస్తుందన్న వార్తలు చాలానే వైరల్‌ అయ్యాయి. ఇక అక్కడి ఏరియా 51 అనే ప్రాంతంలో ఏలియన్స్‌కు సంబంధించిన పరిశోధనలు, వాటితో శాస్త్రవేత్తలు చర్చలు జరుగుతున్నారన్న పుకార్లు షికార్లు అవుతూ వచ్చాయి. ఇక అమెరికా కూడా ఏలియన్స్‌ UFOల జాడలను కనిపెట్టేందుకు, అలాగే ఆకాశంలో ఎగిరే వింత వస్తువుల జాడను కనిపెట్టేందుకు అన్‌-ఐడెంటిఫై ఏరియల్‌ ఫెనోమెనా టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా అమెరికా సైనిక స్థావరాలపై ఆకాశంలో UFOలు చక్కర్లు కొట్టినట్లు అనుమానం వ్యక్తం చేసింది ఫెనోమెనా టీమ్‌. 2004 మార్చి నెల నుంచి 2021 వరకు మొత్తం 144 యూఎఫ్‌ఓలను పోలి ఉన్న వస్తువులను గుర్తించిన్నట్లు తెలిపింది ఫెనోమెనా టాస్క్‌ ఫోర్స్‌. అమెరికా ఆర్మీపైన ఏలియన్స్‌ అటాక్‌ చేసేందుకు ప్రయత్నించాయని వీరలెవల్లో పబ్లిసిటీ కూడా చేసింది ఫెనోమెనా టీమ్‌. కానీ అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేకపోయింది. అయితే ఏ దేశంలోకి ప్రవేశించని ఏలియన్స్‌, ఒక్క అమెరికాలోని ఆర్మీ స్థావరాలపైనే ఎందుకు చక్కర్లు కొడుతున్నాయ్‌ అన్న అనుమానాలు తెర మీదకు చాలానే వచ్చాయి. అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా, యూఎస్ మిలిటరీ, వైమానిక స్థావరం చుట్టూ చాలా యుఎఫ్ఓలు కనిపించాయని అప్పట్లో యూఎస్ భద్రతా విభాగం అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన నివేదికలు, వీడియోలను అమెరికా ప్రభుత్వానికి సమర్పించింది ఫెనోమెనా టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌.

ఇక అమెరికా ఆర్మీ ఏలియన్స్‌పైన సీక్రెట్‌గా రీసెర్చ్‌ చేస్తుందన్న విషయాన్ని ప్రపంచదేశాలు బలంగా నమ్ముతున్నాయి. అమెరికాలోని ఏరియా 51 అనే ప్రాంతంలోనే ఈ పరిశోధనలు జరుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలోకి ఏ ఒక్కరూ ప్రవేశించడానికి వీలు ఉండదు. అంతేకాదు ఈ ప్రాంతం పైనుంచి ఎలాంటి డ్రోన్‌ కెమెరాలు కానీ, విమానాలు ఎగరకూడదు. ఒకవేళ ఈ నిషేధిక ప్రాంతంపై డ్రోన్‌ కెమెరాలను ఎగరేయాలని చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అమెరికా డిఫెన్స్‌ ఆర్మీ.

ఏది ఏమైనా ఏలియన్స్‌ ఉన్నాయని, ఎంత బలంగా నమ్ముతున్నామో.. అమెరికాకు ఏలియన్స్‌కు మంచి రిలేషన్‌ ఉందన్న వాదనలు కూడా అంతే బలంగానే వినిపిస్తుంటుంది. రష్యా వంటి పెద్ద దేశాలు ఏలియన్స్‌ జాడను కనిపెట్టేందుకు ఇంకా పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఏ ఒక్క దేశం కూడా ఇప్పటి వరకు ఏలియన్స్‌ను కనిపెట్టలేకపోయాయి. ఒక్క అగ్రరాజ్యం అమెరికాకు మాత్రం ఇది సాధ్యమైందని, కానీ ఆ విషయాన్ని ప్రపంచదేశాలకు తెలియకుండా దాచి పెడుతుందని అంటున్నారు కొందరు సైంటిస్టులు.

Also Read: పొలంలో బావి మాయం.. వెతికిపెట్టాలని పోలీసులను ఆశ్రయించిన రైతు

తెలంగాణలో పొలిటికల్ జోష్.. రెండున్నరేళ్ళ ముందే దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు