Canada India: భారత విమానాలపై నిషేధం ఎత్తివేసిన కెనడా.. ఈ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే.

|

Sep 27, 2021 | 10:33 AM

Canada India: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో భారత్‌ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడం..

Canada India: భారత విమానాలపై నిషేధం ఎత్తివేసిన కెనడా.. ఈ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే.
Follow us on

Canada India: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో భారత్‌ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడం, కరోనా కంట్రోల్‌లోకి రావడంతో ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నేరుగా భారత్‌ నుంచి వెళ్లే విమానాలపై నిసేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆదివారం కెనడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 27వ తేదీ అర్ధరాత్రి నుంచి భారత్‌ నుంచి నేరుగా విమానాల రాకపోకలు జరగనున్నాయి.

కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్‌ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా హర్షం వ్యక్తం చేశారు. 27వ తేదీ (సోమవారం) నుంచి ఢిల్లీ-టొరంటో/వాంకోవర్‌ల మధ్య రోజువారీ సర్వీసులు మొదలవుతాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ కొన్ని ఆంక్షలు మాత్రం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కెనెడా వెళ్లే ప్రయాణికులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇంతకా నిబంధనలు ఏంటంటే..

* ప్రయాణానికి 18 గంటలకు ముందుగా ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలోని అధీకృత ల్యాబ్‌ నుంచి చేయించుకున్న కోవిడ్‌–19 నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

* వేరే దేశం మీదుగా కెనడాకు వెళ్లే భారత ప్రయాణికులు కూడా మూడో దేశంలో పొందిన కోవిడ్‌–19 నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను ముందుగా చూపించాల్సి ఉంటుంది.

* రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారు సంబంధిత వివరాలను ఆరైవ్‌క్యాన్‌ మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

* పైన తెలిపిన నిబంధనలు పాటించిని వారిని అధికారులు బోర్డింగ్‌ సమయంలో విమానంలో అనుమతించరు.

Also Read: Angela Merkel: జర్మనీలో ముగిసిన ఏంజెలా మెర్కెల్‌ శకం.. పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ డెమొక్రాట్ల పైచేయి..

శ్రీవారిని దర్శించుకున్న దిల్‏రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..

Success Story: పరీక్షకు వెళ్తూ ప్రమాదం..14 ఆపరేషన్లు.. నడవలేవంటూ వదిలేసిన భర్త.. నేడు సివిల్స్ లో టాపర్..