Special People: జంతువుల్లా నడుస్తున్న కుటుంబం.. కారణం తెలిస్తే అయ్యో అనుకోవడం ఖాయం!

ఇప్పటివరకు మనం నాలుగు కాళ్లపై నడిచే జంతువులను మాత్రమే చూశాం. చిన్నపిల్లలు నడక నేర్చుకునే సమయంలో నేలపై పాకుతూ వెళ్ళడం మనం సహజంగా చూసేదే.

Special People: జంతువుల్లా నడుస్తున్న కుటుంబం.. కారణం తెలిస్తే అయ్యో అనుకోవడం ఖాయం!
Special People

Special People: ఇప్పటివరకు మనం నాలుగు కాళ్లపై నడిచే జంతువులను మాత్రమే చూశాం. చిన్నపిల్లలు నడక నేర్చుకునే సమయంలో నేలపై పాకుతూ వెళ్ళడం మనం సహజంగా చూసేదే. అయితే, నాలుగు కాళ్ళపై అంతే.. చేతులు.. కళ్ళు ఉపయోగిస్తూ జంతువుల్లా నడిచే వారిని ఎప్పుడూ చూసి ఉండం. అదేమిటి? అలా నడిచేవారూ ఉంటారా? అని ఎగాదిగా చూసి అడక్కండి.. ఇప్పుడు మీకు మేము పరిచయం చేయబోయే కుటుంబం గురించి తెలిస్తే.. మీరు ఆశ్చర్యంతో అదిరిపోతారు. దీని గురించి శాస్త్రవేత్తలు కూడా చాలా పరిశోధనలు చేశారు. ఎందుకు ఇలా నడుస్తున్నారు వీరు అని.. చ్విఅరికి ఇప్పుడు వారు మిస్టరీని ఛేదించారు.

ఈ వింత కుటుంబం టర్కీలోని ఓ కుగ్రామంలో నివసిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన వారు నడవడానికి రెండు చేతులు, కాళ్లు ఉపయోగిస్తారు. వీరిని చూస్తుంటే మానవ నాగరికత తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని, లక్షల ఏళ్లుగా మన వెనకాలే నడుస్తున్నారని అనిపిస్తుంది. ప్రారంభంలో, శాస్త్రవేత్తలు ఈ పరిస్థితి అర్ధం కాక పరిశోధనలు చేశారు. అయితే ఇప్పుడు దాని మిస్టరీని ఛేదించారు.

DailyMail వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, రెసిట్, హాటిస్ ఉలాస్ కుటుంబం చాలా కాలం పాటు ప్రపంచం నుండి ఒంటరిగా ఉంది. 2005 కి ముందు, ఈ కుటుంబం గురించి ప్రజలకు తెలియదు. అప్పుడు ఒక బ్రిటీష్ శాస్త్రవేత్త ఒక టర్కిష్ ప్రొఫెసర్ ప్రచురించని కాగితాన్ని చూశాడు. అది చదివిన ఆ శాస్త్రవేత్తకు షాక్ తగిలింది. ఈ పేపర్‌లో ఉలాస్ కుటుంబం గురించి వివరించారు. ఇందులో ఈ కుటుంబం నాలుగు కాళ్లపై నడుస్తుందని రాసి ఉంది. కుటుంబానికి యునర్ టాన్ సిండ్రోమ్ ఉందని ఆ పత్రంలో పేర్కొన్నారు.

బ్యాక్‌వర్డ్ ఎవల్యూషన్ సిద్ధాంతం ఇక్కడ నుంచి వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ కుటుంబంపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. అప్పుడు అది జన్యుపరమైన సమస్య అని తేలింది. ఇందులో రెండు పాదాలు బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులు చేతులు, కాళ్ల సాయంతో నడవడానికి ఇదే కారణం. శాస్త్రవేత్తలు నివేదికలో చెప్పిన దాని ప్రకారం.. రెసిట్ మరియు హేటిస్ రెండు కాళ్లపై నడిచే ఇద్దరు వ్యక్తులు. కానీ అతని 19 మంది పిల్లలలో, ఐదుగురు చేతులు, కాళ్ళు ఉపయోగించి నడిచే వారు. ఇప్పుడు ఈ తోబుట్టువుల వయస్సు 25 నుండి 41 సంవత్సరాలు. వారు కూడా ప్రపంచం ముందుకు వచ్చారు. పూర్వం ప్రజలు వారిని చాలా హేళన చేసేవారు. గ్రామంలో నివసించడం వారికి కష్టంగా మారింది. ఉలాస్ కుటుంబానికి చెందిన ఈ పిల్లలు పాఠశాల ముఖం చూడలేకపోవడానికి కారణం ఇదే. కానీ వారికి కుర్దిష్ భాష తెలుసుద్దని ద్వారా వారు తమ జీవనాన్ని సాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: EPF and LIC: మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది తెలుసా? ఇదెలా సాధ్యమంటే..

Omicron: వామ్మో ఒమిక్రాన్.. ఇది ఎందుకు వేగంగా విస్తరిస్తుందో తెలిసింది..ఇది సాధారణ వేరియంట్ కాదు.. అంతకుమించి!

Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!

Click on your DTH Provider to Add TV9 Telugu