Vaccination: వ్యాక్సిన్ వేయించుకో..టెస్లా కారు తీసుకుపో..టీకా పై ఆఫర్ల వర్షం..బారులు తీరిన జనం ఎక్కడంటే..
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలంతా దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా అంతానికి టీకా ఒక్కటే పరిష్కార మార్గంగా పరిశోధకులు చెబుతున్నారు.
Vaccination: కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలంతా దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా అంతానికి టీకా ఒక్కటే పరిష్కార మార్గంగా పరిశోధకులు చెబుతున్నారు. అన్ని దేశాల ప్రభుత్వాలు ఈ విషయాన్నీ పదే పదే ప్రజలకు చెబుతూ తమ పౌరులందరికీ వ్యాక్సిన్ ఇపియించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని దేశాలు వ్యాక్సిన్ కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరికొన్ని దేశాల్లో టీకా వేయించుకోండి బాబులూ అంటే వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ విషయంలో కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం కోసం అనేక తాయిలాలు ప్రకటిస్తున్నాయి.
కోవిడ్ టీకా వచ్చిన కొత్తలో ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు కొన్ని దేశాలు బీర్ ఉచితంగా ఇవ్వడం.. బీమా సదుపాయాన్ని ఉచితంగా కల్పించడం వంటి ఆఫర్లు ఇచ్చాయి. దీంతో కొంతవరకూ ఫలితం కనిపించింది. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇలా ఆఫర్లు ఇచ్చిన దేశాల్లో యూఎస్, యూకే, రష్యా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి హాంకాంగ్ చేరింది. ఇక్కడ మామూలు ఆఫర్లు ఇవ్వడం లేదు. కోట్లాది రూపాయల విలువ చేసే ఆఫర్లు కరోనా టీకా వేయించుకున్నవారికి ఇస్తోంది హాంకాంగ్. ఇంతకీ వాళ్ళు ప్రకటించిన ఆఫర్స్ ఏమిటో తెలిస్తే మీకు కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం.
హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆఫర్ దేశంగా మారింది. రోలెక్స్ వాచ్, టెస్లా ఎలక్ట్రిక్ కార్, గోల్డ్ బిస్కట్, రూ .10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ వంటి ఆఫర్లు ఇక్కడ ఉన్నాయి. అయితే, దీనికి లాటరీ విధానం ఉంటుంది. లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. వాస్తవానికి, కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అదే సమయంలో, టీకా గురించి పుకార్లు ఉన్న అనేక దేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి, టీకాలు పెంచడానికి దేశాల ప్రభుత్వాలు వివిధ ఆఫర్లు ఇస్తున్నాయి.
ఆఫర్లతో పెరిగిన టీకా వేగం..
టీకా వేయించుకోవడానికి ఇంతకు ముందు భయపడిన వారు, ఈ విలువైన ఆఫర్లు వచ్చిన తరువాత, టీకా కోసం ముందుకు వస్తున్నారని హాంకాంగ్ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ప్రత్యేకత ఏమిటంటే, వారు రావడం మాత్రమే కాదు, కుటుంబ సభ్యులను కూడా తీసుకుని వస్తున్నారు. హాంకాంగ్‌లో ఇప్పటివరకు జనాభాలో 30 శాతం (సుమారు 22.7 లక్షలు) మందికి టీకా ఇచ్చారు. ఈ వ్యాక్సినేషన్‌లో 10 శాతం సుమారు 10 నుంచి 15 రోజుల్లో అయింది అంటే ఈ ఆఫర్ల ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఐఫోన్, యుఎస్, ఫ్రాన్స్‌లో ఆఫర్లు ఇలా..
ఆఫర్లను అందించడంలో హాంకాంగ్ ఒంటరిగా లేదు. బీర్, విమాన టిక్కెట్ల తరువాత, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, యుకె వంటి దేశాలలో ఐఫోన్, ప్రపంచ పర్యటన వంటి ఆఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్ల తరువాత, ఈ దేశాల్లో కూడా వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య పెరిగిందని అక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి.
Also Read: China Silo Fields: చైనా బరితెగింపు..భారీగా అణుక్షిపణి సొరంగాల నిర్మాణం..శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి!