Afghanistan: మహిళలపై మరోసారి తాలిబన్ల జులుం.. బ్యూటీ పార్లర్ పై నిషేధం.. సర్వత్రా విమర్శలు

ఆఫ్ఘనిస్తాన్‌లో బ్యూటీ పార్లర్‌లను మూసివేయాలని తాలిబాన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఒక నెల సమయం ఇచ్చింది. తాలిబాన్ జరీ చేసిన డిక్రీపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది.  అంతేకాదు ఈ తాలిబాన్ డిక్రీని ముస్లిం మేధావులు తీవ్రంగా ఖండించారు.

Afghanistan: మహిళలపై మరోసారి తాలిబన్ల జులుం.. బ్యూటీ పార్లర్ పై నిషేధం.. సర్వత్రా విమర్శలు
Taliban On Beauty Parlours

Updated on: Jul 08, 2023 | 12:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అక్కడ మహిళలపై రకరకాల నిషేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు, ఉద్యోగం , ధరించే దుస్తులు లతో పాటు తాజాగా మహిళలపై తాలిబన్లు  మరోసారి డిక్రీ జారీ చేశారు. తాలిబాన్ డిక్రీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. బ్యూటీ పార్లర్‌లు, మేకప్‌లపై నిషేధాన్ని సమర్థించిన తాలిబాన్‌లు ఇప్పుడు కారణాన్ని కూడా తెలియజేశారు. బ్యూటీపార్లర్ ఇస్లాంకు విరుద్ధమని తాలిబాన్‌లు చెప్పారు. బ్యూటీ పార్లర్ లోపల జరిగేదంతా ఇస్లాంకు హరామే.. దీంతో ఇంటి ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సమయంలో బ్యూటీ కోసం ఉపయోగించే వస్తువులతో వరుడి ఇంట్లో ఆర్థిక భారానికి కూడా కారణం అవుతాయంటూ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌లో బ్యూటీ పార్లర్‌లను మూసివేయాలని తాలిబాన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఒక నెల సమయం ఇచ్చింది. తాలిబాన్ జరీ చేసిన డిక్రీపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది.  అంతేకాదు ఈ తాలిబాన్ డిక్రీని ముస్లిం మేధావులు తీవ్రంగా ఖండించారు.

” స్త్రీలు మేకప్ వేసుకోకూడదు-షరియాలో ఎక్కడ రాసి ఉంది ?”
ఆల్ ఇండియా పస్మాండ ముస్లిం మహజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మో. యూనస్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఉగ్రవాద సంస్థచే పాలించబడుతుందని అన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు మహిళల సంపాదన,  అందంగా అలంకరించడం నిలిపివేయాలని కోరుతున్నాయి. అయితే మహిళలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఎలా వారికీ ఉపాధి దొరుకుతుంది? ఎక్కడికి వెళ్లారు ? మహిళలు మేకప్ వేసుకోకూడదని ఏ షరియత్‌లో రాసి ఉందో తాలిబన్లు చెప్తారా అంటూ ప్రశ్నించారు. మహిళలు మేకప్ వేసుకోవడం ఏ విధంగానూ ఇస్లాంకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు స్త్రీలకు అలంకారం, అందంగా తీర్చిదిద్దుకోవడం, ఆభరణాలు ధరించడం లేదా మేకప్ వేసుకోవడం సహజసిద్ధమైన స్వభావమని చెప్పారు మో.యూనస్. పురుషులకు తమ స్వభావాన్ని బట్టి దుస్తులు ధరించి జీవించాలనే కోరిక ఎలా ఉంటుందో..  అదే విధంగా స్త్రీలు కూడా తమ స్వభావాన్ని బట్టి బతకాలనీ కోరుకుంటారు. మేకప్ వేసుకోవాలి, నచ్చిన దుస్తులు ధరించాలని కోరుకుంటే అందులో తప్పేముందని అన్నారు. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని ప్రయత్నిస్తారంటూ ఆలిండియా పస్మాండ ముస్లిం మహాజ్ ఈ తాలిబాన్ డిక్రీని ఖండిస్తున్నాడు.

“తాలిబాన్లు ఇస్లాం మతాన్ని పరువు తీస్తున్నారు”
మరోవైపు మార్క్‌జీ అంజుమాన్-ఎ-ఖాద్రియా అధ్యక్షుడు మౌలానా పీర్ అలీ ఖాద్రీ మాట్లాడుతూ- ఇస్లాంలో మహిళల అలంకరణ పూర్తిగా సమర్థించబడిందని.. అయితే ఆ అందం తన పురుషునికి మాత్రమే ప్రదర్శించాలని.. ప్రపంచానికి చూపించకూడదని చెప్పారు. ఎందుకంటే ఇస్లాంలో గోషా లేదా పర్దాకి ఒక ప్రాముఖ్యత ఉందని తెలిపారు.

పీర్ అలీ ఖాద్రీ మొహమ్మద్ ఇదే విషయంపై స్పందిస్తూ.. తాలిబన్లు ఇస్లాం పేరుతో రోజు విడిచిపెట్టే రకమైన ఫత్వాల దారుణం అని అన్నారు. మేకప్ విషయానికొస్తే.. మహిళలు మేకప్ వేసుకోవడం చట్టవిరుద్ధం కాదన్నారు.

మౌలానా పీర్ అలీ ఖాద్రీ కూడా తాలిబాన్లు మూసివేయాలనుకుంటున్న బ్యూటీ పార్లర్‌లో మహిళలు మాత్రమే పనిచేస్తారని.. ఇది ఎలా చట్టవిరుద్ధమని అంటున్నారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక రకాల బ్యూటీ పార్లర్ ఉన్నాయి. ప్రస్తుతం మహిళలు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాస్తవానికి, తాలిబాన్ జారీ చేస్తున్న ఫత్వాలు లేదా డిక్రీలు ఇస్లాం పరువు తీస్తున్నాయి. తీవ్రవాదాన్ని పెంచుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..