కాబూల్ లోని గురుద్వారాలో సిక్కులు, హిందువులకు అభయమిచ్చిన తాలిబన్లు..అకాలీదళ్ నేత వెల్లడి…

| Edited By: Anil kumar poka

Aug 19, 2021 | 2:33 PM

కాబూల్ లోని గురుద్వారాలో తలదాచుకున్న హిందువులు, సిక్కుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని తాలిబన్లు హామీ ఇచ్చారని అకాలీదళ్ నేత మంజీన్దర్ సింగ్ సిర్సా తెలిపారు. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి ఎం.నయీం గత రాత్రి వీడియో విడుదల చేశారంటూ ఆయన దాన్ని షేర్ చేశారు.

కాబూల్ లోని గురుద్వారాలో  సిక్కులు, హిందువులకు అభయమిచ్చిన తాలిబన్లు..అకాలీదళ్ నేత వెల్లడి...
Taliban Came To Gurudwara Assured Sikhs Hindus For Their Safety
Follow us on

కాబూల్ లోని గురుద్వారాలో తలదాచుకున్న హిందువులు, సిక్కుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని తాలిబన్లు హామీ ఇచ్చారని అకాలీదళ్ నేత మంజీన్దర్ సింగ్ సిర్సా తెలిపారు. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి ఎం.నయీం గత రాత్రి వీడియో విడుదల చేశారంటూ ఆయన దాన్ని షేర్ చేశారు. సిర్సా ఢిల్లీలోని గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ అధ్యక్షుడు కూడా.. తాను కాబూల్ లోని గురుద్వారాతో సదా టచ్ లో ఉంటున్నానని, తాలిబన్ నేతలు..అక్కడి హిందువులు, సిక్కులను కలిసి వారి భద్రతకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. 76 సెకండ్లపై ఈ వీడియోలో పలువురు..గురుద్వారాలోని సిక్కులు, హిందువులతో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. స్థానిక గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ జారీ చేసిన స్టేట్ మెంట్ కూడా ఈ వీడియోలో ఉంది. నయీమ్ ఇదే వీడియోను షేర్ చేసినట్టు సిర్సా తెలిపారు. ఇక్కడి సిక్కులు, భారతీయుల భద్రతకు ఎలాంటి హానీ ఉండదని.. ఇప్పటివరకు వీరు భయాందోళనతో ఉంటూ వచ్చినప్పటికీ..ఇప్పుడిక ఆందోళన అనవసరమని, ఏ సమస్యలూ లేవని భరోసా ఇచ్చామని నయీమ్ పేర్కొన్నారన్నారు.

కాబూల్ లోని గురుద్వారాలో చిక్కుబడిపోయిన సిక్కులను రక్షించాలంటూ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం ఇందుకు అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. అయితే ఆయన చెబుతున్న వారు ఈ గురుద్వారాలోని వారేనా..కారా అన్న విషయం తెలియలేదు. కేంద్ర మంత్రులు హర్ దీప్ సింగ్ పురి, ఎస్. జైశంకర్ కూడా కాబూల్ లోని భారతీయుల రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని ఇదివరకే ప్రకటించారు. ఇలా ఉండగా.. కాబూల్ లో మహిళల బ్యూటీ పారర్ల బయట ఉంచిన మహిళా ఫోటోలకు తాలిబన్లు నల్ల రంగు పూసి అప్పుడే తమ పాశావికతను చాటుకోవడం ప్రారంభించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : 70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

 Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)

 టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.

 తూటతో ప్రాణం.. పాటతో బంధం..! ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ పాపులర్ అయినా సాంగ్..:Bullettu Bandi song video.