Afghanistan: ఆదేశంలో కొత్త చట్టం.. ఇకపై అక్కడ బహిరంగంగా మహిళలు పాడడం, మాట్లాడడం నిషేధం..

|

Aug 25, 2024 | 7:48 AM

ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖంతో సహా మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి. అంతేకాదు ఈ కొత్త చట్టం ప్రకారం మహిళల గొంతులను ప్రైవేట్‌గా పరిగణిస్తున్నారు. కనుక ఇక నుంచి మహిళలు తమ గొంతుని బహిరంగంగా వినిపించడానికి అనుమతించడం లేదు. ఈ నియమాలతో స్త్రీలను పాడటమే కాదు ఏ విధమైన బహిరంగ సంభాషణ కూడా చేయడానికి వీలు లేదు. ఇంకా స్త్రీలు తమకు సంబంధం లేని పురుషుల వైపు చూడటం కూడా నిషేధించబడింది.

Afghanistan: ఆదేశంలో కొత్త చట్టం.. ఇకపై అక్కడ బహిరంగంగా మహిళలు పాడడం, మాట్లాడడం నిషేధం..
Talibans New Law
Follow us on

తాలిబాన్ దాని రాడికల్ ఆలోచనలకు ప్రసిద్ధి చెందింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్లు ఇటీవలే 3 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉంటే అక్కడ మహిళలపై అఘాయిత్యాలు, మహిళపై ఆంక్షలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాలిబాన్ తాజాగా మహిళపై సరికొత్త చట్టాలను తీసుకుని వచ్చంది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు తమ గొంతులను బహిరంగంగా వినిపించడంపై అంటే బహిరంగంగా పాడడం లేదా చదవడాన్ని నిషేధించింది. ఈ కొత్త చట్టానికి సంబంధించిన నిర్ణయాన్ని తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తీసుకున్నారు.

ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖంతో సహా మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి. అంతేకాదు ఈ కొత్త చట్టం ప్రకారం మహిళల గొంతులను ప్రైవేట్‌గా పరిగణిస్తున్నారు. కనుక ఇక నుంచి మహిళలు తమ గొంతుని బహిరంగంగా వినిపించడానికి అనుమతించడం లేదు. ఈ నియమాలతో స్త్రీలను పాడటమే కాదు ఏ విధమైన బహిరంగ సంభాషణ కూడా చేయడానికి వీలు లేదు. ఇంకా స్త్రీలు తమకు సంబంధం లేని పురుషుల వైపు చూడటం కూడా నిషేధించబడింది.

ముస్లిం కాని స్త్రీ, పురుషుల ముందు..

సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత బుధవారం ఈ చట్టాలను జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ చట్టం ప్రజా రవాణా, సంగీతం, షేవింగ్, వేడుకలు వంటి రోజువారీ జీవితంలోని అంశాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు ముస్లిమేతర పురుషులు, మహిళల ముందు కూడా తమను తాము కవర్ చేసుకోవాలి. అంతే కాకుండా మహిళలు సన్నగా, బిగుతుగా, పొట్టిగా ఉన్న దుస్తులు ధరించరాదని చట్టంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఐక్యరాజ్యసమితి ఏం చెప్పిందంటే

ఈ కొత్త నిబంధనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలు ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు, బాలికల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తాయని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ సమాజం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..